Cucumber: ఎండాకాలంలో వేడికి కీరదోస తొందరగా పాడైపోతున్నాయా? ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా? కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే నెల రోజులు అయినా తాజాగా ఉంచొచ్చు.
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో కీీరదోస ముందు వరసలో ఉంటుంది. సమ్మర్ లో కీరదోస ను సలాడ్ గా ఎక్కువగా తింటూ ఉంటారు. అంతెందుకు బర్గర్, శాండ్ విచ్ లకు కూడా ఇది కావాల్సిందే. అయితే.. ఈ మండే ఎండలకు కీరదోస తొందరగా పాడైపోతుంది. ఫ్రిజ్ లో పెట్టినా కూడా ముడతలు వచ్చేసి వడబడిపోయినట్లుగా మారతాయి. వడబడిన వాటిని ఎవరికీ తినాలని అనిపించదు. అందుకే… కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… నెల రోజులైనా కీరదోస తాజాగా ఉంటాయి. ఆ చిట్కాలు ఇప్పుడు చూద్దాం…
24
కీరదోసను ఎలా స్టోర్ చేయాలి?
కీీరదోసను నిల్వ చేయడం కాస్త కష్టమైన పని అనే చెప్పొచ్చు. ఎందుకంటే.. అవి ఎక్కువ వేడికి, అలాగే ఎక్కువ చలికి కూడా తొందరగా పాడైపోతాయి. అలా అని రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచితే మెత్తపడిపోతాయి. ఫ్రిజ్ లో సరిగా స్టోర్ చేయకపోయినా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే, వీటిని సరైన ఉష్ణోగ్రతలో, సరైన పద్దతిలో నిల్వ చేయడం చాలా అవసరం. అప్పుడే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కీరదోస నెల రోజులైనా ఫ్రెష్ గా ఉండాలంటే.. మనం ఒక చిన్న పద్దతిని అనుసరించాలి. ముందుగా ప్రతి కీరదోసను ఒక పేపర్ టవల్ లో గట్టిగా చుట్టాలి. కొంచెం కూడా బయటకు కనిపించకుండా పేపర్ టవల్ తో చుట్టేయాలి. ఇలా చేయడం వల్ల వాటి మీద ఉన్న అదనపు తేమను పేపర్ పీల్చుకుంటుంది.
పేపర్ చుట్టిన కీరదోసలను మళ్లీ ఏదైనా ప్లాస్టిక్ లేదా పాలిథిన్ కవర్ లో చుట్టాలి. దీని వల్ల కీరదోస పాడవ్వకుండా ఉంటుంది. దానికి సరిపడా టెంపరేచర్ దొరుకుతుంది. ఇదొక్క ట్రిక్ ఫాలో అయితే… ఎక్కువ రోజులు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి.
34
ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేయాలి?
ఫ్రిజ్‌లో కీరదోసలను పెట్టేటప్పుడు సరైన చోట పెట్టడం కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్‌లో బాగా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టొద్దు. ముఖ్యంగా కింద భాగంలో పెడితే త్వరగా పాడవుతాయి. ఫ్రిజ్ ముందు వైపు ఉన్న షెల్ఫ్‌లో పెట్టడం ఉత్తమం. అక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. ఈ పద్ధతితో దోసకాయలు వారం కన్నా ఎక్కువ రోజులు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.
చిన్న తప్పుల వల్ల కూడా దోసకాయలు త్వరగా పాడవుతాయి. యాపిల్స్, అరటిపండ్లు, టమాటాల వంటి పండ్ల దగ్గర వీటిని పెట్టొద్దు. వాటి నుంచి వచ్చే ఇథిలీన్ గ్యాస్ వల్ల దోసకాయలు త్వరగా పాడవుతాయి. అలాగే, దోసకాయలను కడిగిన వెంటనే నిల్వ చేయకూడదు, ఎందుకంటే అదనపు తేమ వాటిని కుళ్లిపోయేలా చేస్తుంది. ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఉంచడం, దెబ్బతిన్న దోసకాయలతో కలిపి పెట్టడం, మరీ చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం వంటివి చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దోసకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.