Tea: ఎండాకాలం టీ తాగితే ఏమౌతుంది?
మీకు టీ తాగడం ఇష్టమా? టీ తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేరా? మరి, ఎండాకాలంలో టీ తాగితే ఏమౌతుందో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
మీకు టీ తాగడం ఇష్టమా? టీ తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేరా? మరి, ఎండాకాలంలో టీ తాగితే ఏమౌతుందో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడిగా కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక్కపూట టీ తాగకపోయినా తలనొప్పి వచ్చేస్తుంది. అసలు.. ఉదయం లేచి ఏదైనా పని చేయాలి అంటే.. వారికి కడుపులో టీ పడాల్సిందే. వారికి చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అంటూ కాలంతో సంబంధం ఉండదు. ఉధయం లేచామా.. వేడి వేడిగా టీ తాగామా అని మాత్రమే ఆలోచిస్తారు. మీరు కూడా ఇదే క్యాటగిరిలోకి వస్తారా? అయితే.. మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా వేసవికాలంలో టీ తాగుతున్నారు అంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాల్సిందే. ఆ నష్టాలు ఇప్పుడు చూద్దాం..
వేసవిలో టీ తాగడం మంచిది కాదు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. టీ వల్ల గ్యాస్, అజీర్ణం, పుల్లటి తేన్పులు వంటి సమస్యలు వస్తాయి.
నిద్రలేమి:
టీలో ఉండే కెఫీన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని మనందరికీ తెలుసు. వేసవిలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదు.
చర్మం పొడిబారడం:
వేసవిలో ఎండ వేడికి చర్మం పొడిబారి దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. దీనికి తోడు టీలో ఉండే కెఫీన్ చర్మ సమస్యలను మరింత పెంచుతుంది.
గుండెపై ఒత్తిడి:
వేసవి వేడి కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు టీలో ఉండే కెఫీన్ గుండె వేగాన్ని పెంచి గుండె సమస్యలకు దారితీస్తుంది.
మలబద్ధకం:
వేసవిలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది.
ఆందోళన పెరుగుతుంది:
రోజురోజుకు వేసవి వేడి పెరుగుతుండటంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు టీ తాగితే అందులోని కెఫీన్ ఆందోళనను మరింత పెంచుతుంది.