షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం..
కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది షుగర్ వ్యాధి గ్రస్తులపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, రోజూ తాగొచ్చు. కానీ.. ఎక్కువగా తాగకూడదు.
జీర్ణ సమస్యలు..
ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు త్రాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొంత వరకు మాత్రమే. ఖాళీ కడుపుతో ఎక్కువ కొబ్బరి నీరు త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.ఈ నీటిలో ఉండే పొటాషియం జీర్ణ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.