Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Mar 10, 2026, 10:11 PM IST

Spring Onion Benifits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఎందుకంటే ఉల్లితో అన్ని లాభాలున్నాయి కాబట్టి. పచ్చి ఉల్లి అని పిలిచే ఉల్లికాడలు(స్ప్రింగ్ ఆనియన్స్) మీ ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా? 

PREV
16
స్ప్రింగ్ ఆనియన్ లాభాలు

స్ప్రింగ్ ఆనియన్స్‌ను గ్రీన్ ఆనియన్స్ అని కూడా అంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆ లాభాలేంటో చూద్దాం. 

26
ఉల్లికాడల్లో విటమిన్ C

స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ C ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటే జలుబు, దగ్గు వంటి చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. 

36
గుండెజబ్బులు, క్యాన్సర్ తగ్గే అవకాశం

ఈ ఉల్లికాడల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల శరీరంలో ఇన్‍ఫ్లమేషన్ తగ్గి గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. 

46
అజీర్ణం, మలబద్ధకం సమస్యలు పరార్

అంతేకాకుండా ఇవి జీర్ణక్రియకు కూడా చాలా మంచివి. స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే కొన్ని సహాజ పదార్థాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

56
కేలరీలు చాలా తక్కువ, పోషకాలు ఎక్కువవ

ఈ ఉల్లికాడల్లో విటమిన్ K కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎముకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ప్రింగ్ ఆనియన్స్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పోషకాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని భావించే వారు కూడా వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

66
వంటకాలకు రుచితో పాటు మనకు ఆరోగ్యం

స్ప్రింగ్ ఆనియన్స్‌ను వంటల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫ్రైడ్ రైస్, నూడుల్స్, సూప్స్, సలాడ్స్, ఆమ్లెట్ వంటి వంటల్లో ఎక్కువగా వాడుతారు. ఇవి వంటకాలకు మంచి రుచితో పాటు కలర్‍ఫుల్‍గా ఉంచుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories