Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్ ఈరోజు క‌ట్ చేసేందేనా.? నిన్న‌టిదా.? ఎలా చెక్ చేయాలంటే

Published : Mar 10, 2026, 11:30 AM IST

Mutton: మ‌ట‌న్ చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే మ‌ట‌న్ కొనుగోలు చేసే స‌మ‌యంలో మాత్రం గంద‌రగోళానికి గుర‌వుతుంటారు. కొంత‌మంది వ్యాపారులు తాజా మ‌ట‌న్ కాకుండా, ముందురోజు క‌ట్ చేసిన మ‌ట‌న్‌ను విక్ర‌యిస్తుంటారు. మరి తాజా మటన్ ఎలా గుర్తించాలంటే..  

PREV
15
రంగు చూసి తాజా మటన్ గుర్తించడం

మటన్ తాజాగా ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ముందుగా చూడాల్సింది రంగు. తాజాగా కట్ చేసిన మటన్ సాధారణంగా గులాబీ-ఎరుపు రంగులో మెరుస్తూ క‌నిపిస్తుంది. రంగు చాలా పాలిపోయినట్టు లేదా బూడిద రంగులోకి మారిపోయి ఉంటే అది పాత మాంసం కావచ్చు. మరీ గాఢంగా ఎర్రగా కనిపిస్తే కొన్నిసార్లు అది ఎక్కువ వయసున్న మేక మాంసం అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా సహజంగా కనిపించే ఎరుపు రంగు ఉన్న మటన్ తాజా మటన్‌గా భావిస్తారు.

25
చేతితో తాకి చూసి తెలుసుకునే పద్ధతి

మాంసాన్ని తాకి చూసినా అది తాజాగా ఉందా లేదా అన్నది చెప్పవచ్చు. తాజా మటన్‌ను ముట్టుకున్నప్పుడు కండ గట్టిగా, కొంచెం దృఢంగా ఉంటుంది. చాలా మెత్తగా లేదా జారుడుగా ఉంటే అది ఎక్కువసేపు నిల్వ ఉంచిన మాంసం కావచ్చు. మరీ ఎక్కువగా స్టికీగా లేదా జిగటగా ఉంటే అది పాడవుతున్న సంకేతం. తాజా మటన్‌లో తడి ఉండొచ్చు కానీ అది అతిగా జారిపడేలా ఉండదు.

35
వాసన ద్వారా తాజాదనం గుర్తించండి

మాంసం తాజాగా ఉందా లేదా అన్నది వాసనతో కూడా తెలుసుకోవచ్చు. తాజా మటన్‌కు చాలా తక్కువ వాసన ఉంటుంది. సహజమైన మాంసం వాసన మాత్రమే ఉంటుంది. పుల్లటి వాసన లేదా అసహజమైన గట్టి వాసన వస్తే అది పాడవుతున్న సూచన. మార్కెట్‌లో కొనేటప్పుడు దగ్గరగా చూసి గమనించాలి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ప్యాక్ తెరిచిన వెంటనే వాసన చెక్ చేయడం మంచిది.

45
ఎముకలు, కొవ్వు ద్వారా అసలు నిజం తెలుస్తుంది

మటన్ తాజాగా ఉందా లేదా అన్నది ఎముకలు, కొవ్వు రంగు చూసి కూడా తెలుసుకోవచ్చు. తాజా మటన్‌పై ఉండే కొవ్వు సాధారణంగా తెల్లటి రంగులో ఉంటుంది. కొవ్వు పసుపు లేదా పచ్చటి రంగులో ఉంటే అది ఎక్కువకాలం నిల్వ ఉంచిన మాంసం కావచ్చు. అలాగే చిన్న ఎముకలు, పలుచని కండ ఉంటే అది తక్కువ వయసున్న మేక మాంసం కావచ్చు. పెద్ద ఎముకలు, గట్టిగా ఉన్న మాంసం అయితే అది పాత మేక మాంసం అయ్యే అవకాశం ఉంటుంది. తాజా మాంసం వండినప్పుడు కూడా త్వరగా ఉడుకుతుంది.

55
మటన్ కొనేటప్పుడు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు

మటన్ కొనేటప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన మాంసం పొందవచ్చు. లైసెన్స్ ఉన్న షాపుల నుంచి మాత్రమే కొనండి. రోడ్డు పక్కన లేదా పరిశుభ్రత లేని ప్రదేశాల్లో అమ్మే మటన్‌ను తీసుకోకండి. మాంసం మీద నుంచి రక్తం లేదా నీరు ఎక్కువగా కారితే జాగ్రత్తగా ఉండాలి. మాంసం చాలా చల్లగా గట్టిగా ఉంటే అది ఫ్రిజ్‌లో ఎక్కువకాలం నిల్వ ఉంచినదై ఉండొచ్చు. ఈ విషయాలు గమనిస్తే ఈరోజే కట్ చేసిన తాజా మటన్ సులభంగా గుర్తించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories