Health tips: వైట్ బ్రెడ్ vs టోస్ట్ బ్రెడ్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Published : Mar 29, 2025, 01:48 PM IST

ప్రస్తుతం చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా వైట్ బ్రెడ్, బ్రెడ్ టోస్ట్ తినడం సాధారణం అయిపోయింది. ఈజీగా, త్వరగా చేసుకునే వీలుండటంతో ఎక్కువమంది ఈ బ్రేక్ ఫాస్ట్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే వైట్ బ్రెడ్, బ్రెడ్ టోస్ట్ ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
Health tips: వైట్ బ్రెడ్ vs టోస్ట్ బ్రెడ్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

సాధారణంగా చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా జామ్, వెన్నతో బ్రెడ్ తింటూ ఉంటారు. కొంతమంది బ్రెడ్‌ టోస్ట్ తినడానికి ఇష్టపడతారు. ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. నిజానికి సాధారణ బ్రెడ్ లేదా టోస్ట్ బ్రెడ్ ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న బ్రెడ్ డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. సాధారణ బ్రెడ్ లేదా టోస్ట్ బ్రెడ్ ఈ రెండిట్లో ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.

26
సాధారణ బ్రెడ్ vs టోస్ట్ బ్రెడ్:

సాధారణ బ్రెడ్ తీపి రుచిని కలిగి ఉంటుంది. అలాగే ఇది తేలికగా స్పాంజ్ లా ఉండటం వల్ల తినడానికి సులువుగా ఉంటుంది. కానీ ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే రోస్ట్ చేసిన బ్రెడ్ తేమ తగ్గి క్రిస్పీగా మారుతుంది. అంతేకాకుండా సాధారణ బ్రెడ్‌తో పోలిస్తే ఈ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు తినడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా టోస్ట్ చేసిన బ్రెడ్‌లో స్టార్చ్ పరిమాణం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. టోస్ట్ చేసిన బ్రెడ్‌లో కేలరీలు పెద్దగా తగ్గవు. ఇది తేమని మాత్రమే తగ్గిస్తుంది.

36
షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్?

షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి టోస్ట్ బ్రెడ్ బెస్ట్. ఒకవేళ ఎక్కువ ఫైబర్, పోషకాలు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది.

46
బరువు తగ్గడానికి ఏది మంచిది?

బరువు తగ్గాలనుకునే వాళ్లు సరైన బ్రెడ్‌ తినడం చాలా ముఖ్యం. దీనికి సాధారణ బ్రెడ్ లేదా టోస్ట్ బ్రెడ్ రెండు కరెక్ట్ కాదట. ఈ రెండింటికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండితో చేసిన బ్రెడ్ తినడం ఉత్తమ ఎంపిక. వీటిలో వైట్ బ్రెడ్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

56
ఎవరికి ఏ బ్రెడ్ మంచిది?

- జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, కడుపులో పుండ్లు ఉన్నవాళ్లు టోస్ట్ బ్రెడ్ తినడం మంచిది. బ్రెడ్‌ను వేడి చేసినప్పుడు అందులోని స్టార్చ్ తగ్గిపోతుంది. దీనివల్ల తిన్నప్పుడు కడుపులో తేలికగా అనిపిస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది.

- శరీరానికి ఎక్కువ శక్తి కావాలనుకునే వాళ్లు టోస్ట్ బ్రెడ్‌కు బదులుగా సాధారణ బ్రెడ్ ఉత్తమ ఎంపిక. బ్రెడ్ మాత్రమే తినకుండా అందులో కీరదోస, టమాటో కూరగాయలు వేసి శాండ్‌విచ్‌లా తింటే కేలరీలను తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గం.

- టోస్ట్ బ్రెడ్ తినాలనుకునే వాళ్లు దానితో జామ్ వంటివి వేసుకుని తినకూడదు. కావాలంటే కొద్దిగా వెన్న వేసుకోవచ్చు.

66
ఆరోగ్యానికి ఏది మంచిది?

నిజం చెప్పాలంటే సాధారణ బ్రెడ్ కంటే టోస్ట్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లో తయారుచేసిన టోస్ట్ బ్రెడ్ అయితే ఇంకా మంచిదంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories