Watermelon: ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తింటే ఏమౌతుంది?
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి చల్లదనం, ప్రయోజనాలు కలుగుతాయి. కానీ తప్పు సమయంలో లేదా తప్పుగా తింటే నష్టం కూడా జరగొచ్చు. పుచ్చకాయ తినడానికి సరైన మార్గం, సమయం తెలుసుకోండి.
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి చల్లదనం, ప్రయోజనాలు కలుగుతాయి. కానీ తప్పు సమయంలో లేదా తప్పుగా తింటే నష్టం కూడా జరగొచ్చు. పుచ్చకాయ తినడానికి సరైన మార్గం, సమయం తెలుసుకోండి.
ఎండాకాలంలో పుచ్చకాయ మనకు విరివిగా దొరుకుతుంది. చూడటానికి ఎర్రగా, రుచికి తియ్యగా ఉంటుంది. అంతేకాదు.. ఇది 90 శాతం నీటితో నిండి ఉంటుంది. కాబట్టి.. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఎండాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు పుచ్చకాయ తింటూ ఉంటారు. కానీ, తప్పుడు సమయంలో, తప్పుగా తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని మీకు తెలుసా? మరి, ఈ పండును ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..
పుచ్చకాయ ఏ సమయంలో తినాలి..?
భోజనం తిన్న వెంటనే పుచ్చకాయ తినకూడదు: చాలామందికి అన్నం తిన్న తర్వాత ఏదైనా తియ్యగా తినాలనిపిస్తుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయ తింటారు. కానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినకూడదు. అలా తింటే జీర్ణక్రియలో ఇబ్బందులు, గ్యాస్ సమస్య వస్తుంది. తిన్న తర్వాత కనీసం గంటన్నర తర్వాత పుచ్చకాయ తినాలి.
ఫ్రిజ్ నుండి తీసి వెంటనే పుచ్చకాయ తినకూడదు
చాలామందికి ఫ్రిజ్ నుండి తీసిన చల్లటి పుచ్చకాయ తినాలనిపిస్తుంది. కానీ నిపుణుల ప్రకారం, అలా తింటే గొంతు నొప్పి, జలుబు వస్తుంది. కాబట్టి కొంతసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచి, తర్వాత తినాలి.
పుచ్చకాయకు ఉప్పు, చాట్ మసాలా వేసుకుని తినకూడదు
కొంతమందికి పండ్ల చాట్ అంటే ఇష్టం. పుచ్చకాయకు ఉప్పు, చాట్ మసాలా వేసుకుని తింటారు. దీనివల్ల రుచి బాగుంటుంది. కానీ అలా తినడం వల్ల శరీరంలో సోడియం పెరిగి, బీపీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇబ్బంది. బీపీ ఉన్నవారు పుచ్చకాయకు ఉప్పు వేసుకుని తినకూడదు.
పుచ్చకాయను సరిగ్గా ఎలా తినాలి?
ఉదయం టిఫిన్ తో పాటు ఒక గిన్నె పుచ్చకాయ తినవచ్చు. ఎంత తినగలరో అంతే కట్ చేసుకోవాలి. ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. పుచ్చకాయను ఒక్కటే తినాలి. ఇతర పండ్లతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
ఎండాకాలంలో పుచ్చకాయ తినడం వల్ల లాభాలు
పుచ్చకాయలో 90% నీళ్ళు ఉంటాయి. దీనివల్ల ఎండాకాలంలో శరీరానికి నీళ్ళు అందుతాయి. డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ బీపీని నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6 మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. సహజ చక్కెర, ఎలక్ట్రోలైట్స్ శరీరానికి శక్తినిస్తాయి. వ్యర్థాలను బయటకు పంపి, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. లైకోపీన్, పొటాషియం ఎముకలను దృఢంగా చేసి, ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతాయి.