Gram Flour: శనగ పిండితో రోజూ తింటే ఏమౌతుంది?

శనగపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి, శనగపిండిని ఎలాంటి సందేహం లేకుండా ఆహారంలో చేర్చుకోవచ్చు.

health benefits of eating gram flour in telugu ram

శనగపిండి భారతీయుల ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే వంటకం. చర్మ సంరక్షణలో శనగపిండిని ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. శనగపిండిని చర్మానికి ఉపయోగిస్తే అందాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పచ్చి శనగలతో శనగపిండి తయారు చేస్తారు. దీనిని అనేక రకాల వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా శనగపిండితో తయారు చేసే వంటకాలు ఎక్కువగా నూనెలో వేయించడం వల్ల ఇది తినడం ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

కానీ, నిజానికి శనగపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి, శనగపిండిని ఎలాంటి సందేహం లేకుండా ఆహారంలో చేర్చుకోవచ్చు. శనగపిండిని తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.
 

health benefits of eating gram flour in telugu ram

శనగపిండిలో ఉండే పోషకాలు :

శనగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, రాగి, సెలీనియం, జింక్, మాంగనీస్, విటమిన్ కె వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

శనగపిండిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది :

శనగపిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు శనగపిండిని ఆహారంలో చేర్చుకోవచ్చు. శనగపిండితో మీరు చపాతీ లేదా పరాఠ కూడా చేసుకుని తినవచ్చు.
 


గుండె ఆరోగ్యానికి మంచిది:

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు శనగపిండిలో ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వంటి సమస్యలు పెరుగుతాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 

ఒక అధ్యయనంలో, శనగపిండి బరువు తగ్గడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ , ప్రోటీన్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. అంతేకాకుండా శనగపిండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు శనగపిండిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. 
 

పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడుతుంది :

మెక్సికన్ అధ్యయనం ప్రకారం, శనగపిండి పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడుతుందని కనుగొనబడింది. శనగపిండి క్యాన్సర్ కారకమైన బీటా-క్యాటెనిన్ చర్యను నిరోధిస్తుంది. కాబట్టి మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే శనగపిండిని తీసుకోండి.

ఎముకలను బలోపేతం చేస్తుంది:

శనగపిండిలో ఉండే కాల్షియం ,భాస్వరం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి మీ ఎముకలను బలంగా చేయాలనుకుంటే, శనగపిండిని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది ఎముకలను బలంగా చేయడమే కాకుండా, ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది.
 

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది:

మలబద్ధకంతో బాధపడుతుంటే శనగపిండిని మీ ఆహారంలో చేర్చుకోండి. శనగపిండిలో ఉండే ఫైబర్ మలం గట్టిపడకుండా మెత్తగా ఉండి, సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇది ప్రేగుల కదలికను కూడా మెరుగుపరుస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది:

శనగపిండిలో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. కాబట్టి ఇనుము లోపం ఉన్నవారు శనగపిండిని తమ ఆహారంలో చేర్చుకుంటే ఇనుము లోపం తగ్గుతుంది మరియు రక్తహీనత తగ్గుతుంది.

గమనిక : శనగపిండి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఎక్కువగా తింటే దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.

Latest Videos

vuukle one pixel image
click me!