వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. మనం వెల్లుల్లిని రకరకాల వంటల్లో వాడుతుంటాం. ఇది వంటలకు మంచి రుచిని, వాసనను ఇస్తుంది. వెల్లుల్లిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
వంటింట్లో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి1, కాల్షియం, సెలీనియం, రాగి వంటి పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణ సమస్య, కీళ్ల నొప్పులు, వాపు వంటి అనేక సమస్యలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
24
వెల్లుల్లితో కలిపి తీసుకోవాల్సిన పదార్థాలు...
వెల్లుల్లితో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా దాని ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. వెల్లుల్లితో కొద్దిగా వాము కలిపి నూరి కషాయం చేసి పిల్లలకు ఇస్తే వాంతులు, ఆవలింతలు తగ్గుతాయి.
2. వెల్లుల్లి, కలబందను కలిపి దాని రసాన్ని పిల్లలకు ఇస్తే నులి పురుగుల వంటివి తగ్గిపోతాయి.
3. వెల్లుల్లిని పచ్చిగా తింటే అజీర్తి, కడుపు నొప్పి తగ్గుతాయి. రక్తపోటు తగ్గుతుంది. శరీరం బలంగా, ఉత్సాహంగా ఉంటుంది.