Breakfast Ideas: ఒకే పిండితో 4 రకాల టిఫిన్స్.. బ్యాటర్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ!

Published : Apr 20, 2026, 12:31 PM IST

బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తు వచ్చేవి ఇడ్లీ, దోశ, ఊతప్పం. సాధారణంగా అయితే వీటి కోసం సెపరేట్ గా పిండి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకే పిండితో వీటన్నింటిని తయారు చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? పిండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. 

PREV
16
ఒకే బ్యాటర్ తో చాలా రకాల టిఫిన్స్

చాలా ఇళ్లల్లో ఉదయం పూట ఎక్కువశాతం ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి టిఫిన్స్ తయారు చేస్తుంటారు. మామూలుగా అయితే ఒక్కో టిఫిన్ తయారు చేయడానికి ఒక్కోరకంగా పిండి కలపాల్సి ఉంటుంది. కానీ.. ఈ మూడు రుచికరమైన టిఫిన్స్ ఒకే పిండితో తయారుచేసుకోవచ్చు. ఇవే కాదు పొంగనాలు వంటి ఇంకా ఎన్నో రుచికరమైన టిఫిన్స్ ని కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ టిఫిన్స్ కోసం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా..

26
కావాల్సిన పదార్థాలు

ఇడ్లీ రైస్- రెండు గ్లాసులు

మినపప్పు- ఒక గ్లాసు,

రాగులు- ఒక గ్లాసు

మెంతులు- టీస్పూన్

ఉప్పు- తగినంత

నీరు- సరిపడా

మొదట రైస్, మినపప్పు, రాగులు, మెంతులు అన్నింటినీ కడిగి, సుమారు 5-6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత గ్రైండర్‌లో వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వీటిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి రాత్రంతా లేదా కనీసం 8 గంటలపాటు పులియనివ్వాలి. పిండిలో చిన్న చిన్న బుడగలు ఏర్పడి, పిండి మంచి వాసన వస్తే అది బాగా పులిసిందని అర్థం.

36
ఇడ్లీలు

చక్కగా పులిసిన పిండితో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. పిండిని ఒకసారి బాగా కలిపి, ఇడ్లీ పాత్రలో వేసి, సుమారు 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ఈ పిండితో ఇడ్లీలు సాఫ్ట్ గా, ప్లఫీగా వస్తాయి. వీటిని సాంబార్, చట్నీ లేదా కారం పొడి తో తింటే అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది.

46
దోశ

ఇక అదే పిండిలో కొంచెం నీరు కలిపి, పిండిని కాస్త పలుచగా చేసి దోశలు వేసుకోవచ్చు. పెనంపై దోశ వేసుకొని కాస్త నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. మీకు నచ్చితే ఈ దోశ పిండిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి రవ్వదోశ తరహాలో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి, పల్లీ చట్నీతో దోశ సూపర్ గా ఉంటుంది. 

56
ఊతప్పం

అదే పిండిని వాడి ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చు. ఊతప్పం కోసం పిండిలో తక్కువ నీరు కలిపి, బ్యాటర్ కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. పిండిని పెనంపై కాస్త మందంగా వేసి పైన ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి ముక్కులు వేసుకోవచ్చు, కాస్త కొత్తిమీర వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. తక్కువ మంట మీద కాల్చితే ఊతప్పం మధ్యలో మెత్తగా, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇది సాంబార్, కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

66
గుంత పొంగనాలు

ఇడ్లీ, దోశే కాదు.. ఈ పిండితో గుంత పొంగనాలు కూడా తయారుచేసుకోవచ్చు. పిండిలో కాస్త జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తక్కువ నూనె వేసి గుంతల పెనంపై ఉడికించుకోవాలి. ఇవి లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉంటాయి. పల్లీ చట్నీ, అల్లం చట్నీతో సూపర్ గా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories