ఫైబర్ అధికంగా ఉంటుంది...
ఓట్స్ లో సొల్యూబుల్ ఫైబర్ చాలా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీని వల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాదు... దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్...
ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి... రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. శరీరంలో కొవ్వు నిల్వ చేయకుండా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
అధిక ప్రోటీన్
ఓట్స్‌లో ఉన్న ప్రోటీన్ మజిల్స్ ని బలంగా చేస్తుంది, మెటబాలిజాన్ని వేగంగా పనిచేయిస్తుంది. ఫ్యాట్ బర్న్ వేగంగా జరుగుతుంది.
జంక్ ఫుడ్‌కు బదులుగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
ఓట్స్ దోశ తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. రోజులో అనవసర స్నాకింగ్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.