డాక్టర్లు సూచిస్తున్న హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలుసా?

Published : Nov 29, 2025, 05:29 PM IST

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండాలంటే.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. 

PREV
17
ఇడ్లీ

ఉదయాన్నే ఇడ్లీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీ తేలికగా జీర్ణమవుతుంది. శరీరానికి అవసరమైన శక్తి, ప్రోటీన్ లను ఇస్తుంది. రోజును చురుకుగా ప్రారంభించడానికి ఇది మంచి ఆహారం. నూనె వాడకం ఉండదు కాబట్టి బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. సాంబార్, చట్నీలతో కలిపి తింటే విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి.

27
పెసరట్టు

పెసరపప్పుతో తయారయ్యే పెసరట్టులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడంతో పాటు ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. అల్లం చట్నీ లేదా ఉల్లిపాయలతో తింటే రుచి పెరుగుతుంది. పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. 

37
రాగి ఇడ్లీ లేదా రాగి దోశ

రాగి ఇడ్లీ లేదా రాగి దోశలో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందుతాయి. రాగి ఇడ్లీ తేలికగా జీర్ణమవుతుంది. రాగి దోశ రుచిగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు, షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. సాంబార్, చట్నీలతో తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

47
పోహా

అటుకులతో తయారయ్యే పోహా త్వరగా జీర్ణమవుతుంది. కడుపు మీద భారం ఉండదు. ఇందులో కార్బోహైడ్రేట్లు సరైన మోతాదులో ఉండి ఉదయం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. పోహాలో ఉల్లిపాయ, క్యారెట్, పల్లీలు వంటివి వేసుకుంటే ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు కూడా లభిస్తాయి. ఇవి కడుపు నిండుగా ఉంచి ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. 

57
వెజిటేబుల్ పొంగల్

వెజిటేబుల్ పొంగల్ బియ్యం, పప్పులు, కూరగాయలతో తయారవుతుంది. ఇది శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్‌ను సమతుల్యంగా అందిస్తుంది. కూరగాయలు వేయడం వల్ల విటమిన్‌లు, ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది తేలికగా జీర్ణమయ్యే వంటకం. 

67
వెజిటేబుల్ ఊతప్పం

వెజిటేబుల్ ఊతప్పం రుచిగా ఉంటుంది. పోషకాలతో నిండి ఉంటుంది. ఊతప్పంపై ఉల్లిపాయ, టమాట, క్యారెట్, క్యాప్సికం వంటి కూరగాయలు వేయడం వల్ల ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఊతప్పం తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. సాంబార్ లేదా చట్నీలతో తింటే రుచి మరింత పెరుగుతుంది.

77
గోధుమ రవ్వ ఉప్మా

గోధుమ రవ్వ ఉప్మాను ఈజీగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోధుమ రవ్వలో ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. కూరగాయలు వేయడం ద్వారా అదనంగా విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories