White Rice: షుగర్ పేషెంట్స్ అన్నం తినడం మంచిది కాదని అందరూ నమ్ముతారు.అంతేకాదు, బరువు తగ్గాలి అనుకునే వారు కూడా వైట్ రైస్ తినడం మానేస్తారు. కానీ, డాక్టర్లు చెప్పిన ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే చాలు.
డయాబెటీస్ ఉన్నవారు వైట్ రైస్ చాలా తక్కువగా తింటారు. నార్మల్ అన్నం కి బదులుగా బ్రౌన్ రైస్ , జొన్న అన్నం, రోటీ లాంటివి తింటారు. ఎందుకంటే వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. కానీ, వైట్ రైస్ తిన్నా కూడా బరువు పెరగకుండా, షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చని మీకు తెలుసా? దీని గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
23
అన్నం వండే విధానం చాలా ముఖ్యం..
మనం అన్నం వండే విధానంలో మార్పులు చేసుకుంటే.. అధిక బరువు పెరగకుండా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.చిన్న మార్పులే ఎక్కువ ప్రతిఫలాన్ని అందిస్తాయి.
వేడి వేడి అన్నం తినకూడదా..?
చాలా మంది వండిన వెంటనే అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తూ ఉంటుంది. వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.కానీ, తాజాగా వండి అన్నంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ పెంచుతుంది. ఎక్కువ కేలరీలు కూడా ఉంటాయి. ఇలా తిన్నప్పుడు అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అధిక బరువు ఉన్నవారు, మధు మేహం, ప్రీ-డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఇలా వేడి అన్నం తినకపోవడమే మంచిది.
33
మరి, అన్నం ఎలా తినాలి..?
తాజాగా, అప్పుడే వండిన వేడి వేడి అన్నం కాకుండా... అన్నం ఆరిన తర్వాత తినాలి. అన్నం చల్లారడం వల్ల ఒక రకమైన పిండి పదార్థం ఏర్పడుతుంది. అది ఫైబర్ లా పని చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ తొందరగా పెరగవు. మీరు అన్నం వండి, అన్నం వండి.. దానిని చల్లార్చినప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ గా మారుతుంది. ఇది మీ ప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఫైబర్. ఇలా చల్లారిన అన్నంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.