కోడి గుడ్డు ప్రోటీన్, విటమిన్, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఒక అద్భుతమైన ఆహారం. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి వెచ్చదనం, శక్తి కోసం వీటిని ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే, కోడి గుడ్లను నిల్వ చేసే విషయంలో అజాగ్రత్తగా ఉంటే అవి ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తాయి. గుడ్ల నిల్వ, వాటి నాణ్యతను ఎలా గుర్తించాలి? ఫ్రిజ్ లో ఎన్ని రోజులు వీటిని నిల్వ చేయవచ్చు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
కోడి గుడ్లు ఎందుకు పాడౌతాయి..?
కోడి గుడ్లు పాడవ్వడానికి ప్రధాన కారణం సాల్మొనెల్లా ( Salmonella) అనే బ్యాక్టీరియా. ఇది వేగంగా వృద్ధి చెందితే గుడ్డు త్వరగా పాడౌతుంది. ఇలాంటి గుడ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు,విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.