మునగ చెట్టు ఆకుల నుంచి తయారుచేసే పొడిని మునగాకు పౌడర్‌గా చెబుతుంటారు. ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ మునగాకు పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల పురుషుల్లోనూ సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. శుక్రకణాల సంఖ్య, నాణ్యత తగ్గడం సర్వసాధారణంగా మారిపోయింది. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారికి మునగాకు పొడి ఒక వరంలాంటిదని వైద్యులు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ వైద్యురాలు ఎంబీ శృతి మువ్వ సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియోలో పురుషుల్లో సంతానలేమి సమస్యకు మునగాకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
25
మునగాకు పొడి ఉపయోగాలు
ప్రతీ రోజూ మగవారు మునగాకు పొడిని ఆహారంలో లేదా నీటిలో కలుపుకొని తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని డాక్టర్ తెలిపారు. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. శుక్ర కణాల నాణ్యత, చురుకుదనం పెరుగుతుందని అన్నారు. శుక్రకణాల సంఖ్య తక్కువ ఉన్న వారికి మునగాకు పొడి బాగా ఉపయోగపడుతుంది.
100 గ్రాముల మునగాకులో
100 గ్రాముల మునగ ఆకులో 64 కిలో క్యాలరీలు, 9.4 గ్రాములు ప్రోటీన్, 2 గ్రాముల ఫైబర్, 337 మిల్లీగ్రాముల పొటాషియం, 185 మి. గ్రాముల క్యాల్షియం, 42 మి.గ్రా మెగ్నీషియం, 113 మి.గ్రా విటమిన్ E, 51.7 మిల్లీగ్రాముల, 113 మి.గ్రాముల విటమిన్ సి, 1.2 మిల్లీగ్రాముల విటమిన్ B6 ఉంటుంది.
35
పోషకాల నిధి
మునగాకు పొడిలో విటమిన్ సి, ఏలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్లాసు పాలు, పాలకూరలో కంటే ఎక్కువ క్యాల్షియం ఈ పొడిలో ఉంటుంది. ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కేవలం పురుషులకే కాకుండా మహిళలకు కూడా మునగాకు పొడి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత సమస్య బాధపడుతోన్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. లివర్ పనితీరును మెరుగురచడంలో కూడా మునగాకు పొడి కీలక పాత్ర పోషిస్తుంది.
55
చర్మ సౌందర్యానికి కూడా
మునగాకు పొడిని తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగువుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మొటిమలు తగ్గడం, చర్మం గ్లో రావడం వంటి లాభాలు ఉంటాయని అంటున్నారు. మునగాకులను తీసుకొని బాగా ఎండబెట్టి పొడి రూపంలో స్టోర్ చేసుకొని ఉపయోగించుకోవచ్చని డాక్టర్ తెలిపారు. మునగాకు పొడితో కలిగే లాభాలు ఏంటో డాక్టర్ శృతి మువ్వ మాటల్లో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.