డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతమంచిదో మనకు తెలుసు. ఈ పండును కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు ఈ ఫ్రూట్ ని కచ్చితంగా తినాలంటున్నారు. ఎందుకో.. ఈ ఫ్రూట్ వల్ల ఆడవాళ్లకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
డ్రాగన్ ఫ్రూట్ రుచికరమైనది మాత్రమే కాదు.. అనేక పోషకాలతో కూడినది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మహిళలకు ఇది వరం లాంటిది. కాబట్టి మహిళలు ఈ పండు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌ను మహిళలు ఎందుకు తప్పనిసరిగా తినాలో ఇక్కడ చూద్దాం.
25
ఐరన్ లోపం :
మహిళలకు ఐరన్ చాలా అవసరం. నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా మహిళల్లో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో గణనీయమైన మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల ఇది రక్తహీనతను నివారించి.. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
ఎముకల బలానికి :
డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలపడుతాయి. ముఖ్యంగా మహిళలు మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు ఆస్టియోపోరోసిస్ (osteoporosis) వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
35
జీర్ణ ఆరోగ్యం :
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటే పోషకాలు సరిగ్గా శోషించబడతాయి. పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :
డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే అంటువ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది :
ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక. ముఖ్యంగా ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది.
55
గర్భిణీలు తినవచ్చా?
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫోలేట్.. గర్భిణీలకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది గర్భంలో ఉన్న శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో ఉండే ఐరన్ గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి మహిళలు డ్రాగన్ ఫ్రూట్ కచ్చితంగా తినండి. ఆరోగ్యంగా ఉండండి.