
వయసు పెరుగుతుంటే మనం సహజంగానే కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఉండాలంటే కచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మన వయసు 60 దాటినా.. మెదడు మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలా పని చేయాలంటే.. కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తినాలి. మరి, వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
విటమిన్ E మెదడు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. రెగ్యులర్ గా విటమిన్ ఈ తీసుకునే వారి మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. మీరు ముసలివాళ్లు అయినా, మీ మెదడు మాత్రం యవ్వనంగా ఉంటుంది. ఈ విటమిన్ E కోసం మనం రెగ్యులర్ గా బాదం పప్పు, హాజెల్ నట్స్ కచ్చితంగా తీసుకోవాలి. ఇవి మీ జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలోనూ సహాయం చేస్తాయి.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెరుగైన న్యూరాన్ పనితీరుతో ముడిపడి ఉంటాయి. మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న వాల్‌నట్స్ రోజుకి రెండు అయినా తినాలి. ఇవి, చూడటానికి కూడా మెదడు ఆకారంలోనే ఉంటాయి. మన మెదడు కణాల పనితీరు మెరుగుపరడచంలోనూ సహాయం చేస్తాయి.ఇక, బాదం పప్పు, పిస్తా వంటి గింజల్లో మెదడు వాపును తగ్గించే యాంటీ ఆక్సిడంట్లు పుష్కలంగా ఉంటాయి.
జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.జీడిపప్పులో ఉండే మెగ్నీషియం.. ఒత్తిడి, మానసిక కల్లోలాలకు సంబంధించిన న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
విటమిన్ బి..
చాలా మంది విటమిన్ బి కేవలం శక్తి కోసమే అని నమ్ముతారు, కానీ అవి వాస్తవానికి న్యూరోట్రాన్స్మిటర్లను నిర్మిస్తాయి. ఈ విటమిన్ బి మనకు వేరుశెనగల్లో పుష్కలంగా లభిస్తుంది.
ట్రిప్టోఫాన్ అనేది హ్యాపీ హార్మోన్ . బాదంపప్పుల్లో ఈ హార్మోన్ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం, సెరోటోనిన్ హార్మోన్‌కి మూలం. ఇది మానసిక ప్రశాంతతను కలిగించడంలో సహాయపడతాయి.
వాల్‌నట్‌లలో పాలీఫెనాల్స్
వాల్‌నట్స్‌లో ఉండే పాలీఫెనాల్స్ మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతాయి. ఇది మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది.
నట్స్ లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి గట్ బాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం, ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ మెరుగైన మెదడు పనితీరుకు దోహదం చేస్తుంది.
శక్తి సరఫరా
నట్స్ లో కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ, అవి చాలా నెమ్మదిగా విడుదలౌతాయి. కాబట్టి.. మనకు రోజంతా ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. రోజంతా అలసట లేకుండా ఉంచుతుంది. నీరసంగా అనిపించదు. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందుకే, ప్రతిరోజూ అన్ని రకాల నట్స్ కలిపి గుప్పెడు తీసుకోవాలి.