kitchen tips:భారతీయ వంటకాలలో ఉల్లిపాయకు ప్రత్యేకంగా స్థానం ఉంది. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకం చేయలేం. ఇది రుచిని పెంచే కూరగాయనే కాకుండా.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాంటి ఉల్లిపాయను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి.
ఉల్లిపాయలు కొన్న తర్వాత 2-3 రోజులు ఎండలో బాగా ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమ పోతుంది, త్వరగా పాడవవు.
27
వేరు చేయండి
నిల్వ చేసే ముందు ప్రతి ఉల్లిపాయను పరీక్షించండి. ఏదైనా ఉల్లిపాయ కుళ్ళిపోయి, మెత్తగా ఉంటే వెంటనే వేరు చేయండి, లేకుంటే మిగిలిన ఉల్లిపాయలు కూడా పాడైపోయే అవకాశముంది.
37
అలాంటి చోట నిల్వ
ఉల్లిపాయలను తేమ లేని, గాలి ప్రసరణ ఉన్న చోట ఉంచండి. చీకటి, చల్లని ప్రదేశంలో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమం.