Kurkure Recipe: నోరూరించే క్రిస్పీ 'కుర్​ కురే '.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

Published : Jul 06, 2025, 10:30 AM IST

Kurkure Recipe: కుర్​ కురేలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో లభించే రుచికరమైన కుర్‌కురేను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది తెలుసుకుందాం.

PREV
15
వర్షాకాలంలో వేడివేడి కుర్‌కురే.. ఇంట్లోనే తయారు!

వర్షం పడుతుంటే వేడి టీతో పాటు క్రిస్పీగా, రుచిగా ఉండే కుర్‌కురే తినాలనిపించడం సహజమే. అయితే..వీటి కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో దొరికే వాటి కంటే రుచికరంగా , తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కుర్‌కురే తయారు చేసుకోవచ్చు. అది కూడా సులభమైన పద్ధతిలో.. వాటిని తింటుంటే మీకు అచ్చం దుకాణంలో చేసిన కుర్‌కురే తిన్నట్లు అనిపిస్తుంది. అదీ తక్కువ ఖర్చులోనే.. 

25
వేడి టీతో పాటు కుర్‌కురే

సాయంత్రం వర్షం పడుతుంటే..  ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఈ సమయంలో చాలా మంది పకోడీలు, బజ్జీలు వంటి వేడి  తినుబండారాలు తినడానికి  ఇష్టపడతారు. కానీ అదే సమయంలో కుర్‌కురే తినే అవకాశం దొరికితే ఇంకేముంది. కుర్కురే లంటే పిల్లలకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చాలామందికి ఇంట్లో కుర్‌కురే తయారు చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ ఈ సరళమైన చిట్కాలతో ఇంట్లోనే క్రిస్పీగా, రుచికరంగా కుర్‌కురే తయారు చేసుకోవచ్చు. మార్కెట్ కుర్‌కురేలా కాకుండా ఇది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. 

35
ఇంట్లోనే క్రిస్పీ కుర్‌కురే!

చాలామంది ఇంట్లో తయారుచేసే కుర్‌కురే దుకాణంలో దొరికేలా రుచిగా, క్రిస్పీగా ఉండదని అంటుంటారు. కానీ నిజానికి, సరైన పద్ధతిని పాటిస్తే.. ఇంట్లో తయారు చేసిన కుర్‌కురేను చూడగానే నోరూరుతుంది. ఇది మీ ఆకలిని సైతం తీరుస్తుంది. అంతేకాదు.. బయట కొనే కుర్‌కురే కంటే చాలా తక్కువ ఖర్చుతో, మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది.

45
కుర్‌కురే తయారీకి కావలసినవి

కుర్‌కురే తయారీకి కావలసినవి: 

  • శనగపిండి – 1 కప్పు
  • బియ్యప్పిండి – ½ కప్పు
  •  కార్న్‌ఫ్లోర్ – 2 స్పూన్లు
  • బేకింగ్ సోడా – చిటికెడు
  • ఉప్పు, పసుపు, కారం – రుచికి సరిపడా
  • వేడినీరు – కలపడానికి అవసరమైనంత
  • నూనె – వేయించడానికి
  • చాట్ మసాలా –  
  • గోధుమపిండి  
55
తయారీ విధానం
  • ఒక గిన్నెలో శనగపిండి, బియ్యపు పిండి,  కార్న్‌ఫ్లోర్, బేకింగ్ సోడా వేసి కలపండి. అందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలపాలి. తరువాత వేడినీరు పోసి, ఈ మిశ్రమాన్ని పల్చటి ద్రావణంగా చేయాలి.
  • పాన్‌లో నూనె వేసి మిడియం ఫ్లేమ్ పై వేడిచేయండి. తర్వాత మంటను తగ్గించాలి. ఇది కుర్‌కురే మాడిపోకుండా చేస్తుంది.
  • ఒక శుభ్రమైన పలుచని వస్త్రం తీసుకుని పిండిని అందులో పోసి, సంచి కట్టండి. ముందుభాగంలో చిన్న రంధ్రం చేసి, ద్రావణాన్ని నెమ్మదిగా నొక్కుతూ వేడి నూనెలో వేయండి. ఇది కుర్‌కురే ఆకారాన్ని ఇస్తుంది.
  • కుర్‌కురేను తక్కువ మంటపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు, మెల్లగా క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి.
  • నూనెలో నుంచి తీసిన అనంతరం, ఓ ప్లేట్‌లో వేసి, చాట్ మసాలా చల్లి కలపండి. వాటిని ఫ్లేట్ లో వేసి సర్వ్ చేయండి.  వేడి వేడి, కరకరలాడే హోమ్‌మెయిడ్ కుర్‌కురే తింటూ ఎంజాయ్ చేయండి. 
Read more Photos on
click me!

Recommended Stories