Lime vs Lemon: నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తెలిసిందే. మార్కెట్లో మనకు రెండు రకాల నిమ్మకాయలను కనిపిస్తాయి. ఆకుపచ్చ (లైమ్), పసుపుపచ్చ (లెమన్) చూడ్డానికి ఒకటిలాగే కనిపించినా, వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
లైమ్ గ్రీన్ కలర్‌లో చిన్నగా, గోళాకారంగా ఉంటాయి. ఇవి చిన్నాగా ఉన్నా ఘాటైన వాసన ఉంటాయి. ఇవి వంటల్లో ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఇక లెమన్ పసుపు రంగులో కొంచెం పెద్దగా, అండాకారంలో ఉంటుంది. సాధారణంగా దీనిని మనం జ్యూస్‌లలో, డీటాక్స్ డ్రింక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తాం.
25
రుచి, సువాసనలో తేడా
లైమ్‌లో సిట్రిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రుచి ఎక్కువ పుల్లగా ఉంటుంది. కొద్దిగా తీపి మిశ్రమం కూడా ఉంటుంది. లెమన్‌లో మాత్రం పులుపు తక్కువగా, కానీ ఘాటైన వాసనతో ఉంటుంది. దీని రుచిలో కొద్దిగా చేదు కూడా ఉంటుంది. అందుకే ఇది పచ్చళ్ళు, చట్నీల తయారీలో ఉపయోగిస్తారు.
35
ఆరోగ్యానికి ఏది మంచిది?
రెండు రకాల నిమ్మకాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా లైమ్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే లెమన్‌లో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి, శరీర వాపు తగ్గించడంలో సహాయపడతాయి.
లైమ్ తొక్క మందంగా ఉంటుంది, దీనిని బేకింగ్, డెజర్ట్స్, సాస్‌లలో రుచి కోసం ఉపయోగిస్తారు. లెమన్ తొక్క సన్నగా ఉన్నా, దీని నూనెలు సువాసనతో ఉంటాయి. ఇవి కాక్‌టెయిల్స్, డ్రెస్సింగ్‌లు, డ్రింక్స్ తయారీలో విస్తృతంగా వాడుతారు.
55
డైట్ కోసం ఏది మంచిది?
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లైమ్ రసాన్ని కలుపుకొని తాగితే శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే లెమన్‌ను సలాడ్‌లు, పచ్చళ్ళు, సీఫుడ్‌లో బాగా ఉపయోగపడతాయి. మొత్తం మీద రెండూ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి సహజ తేజస్సును ఇస్తాయి.