ఈ సండే మీ ఇంట్లో “చికెన్ భ‌ర్తా” ట్రై చేయండి.. లొట్ట‌లేసుకొని తిన‌క‌పోతే ఛాలెంజ్‌

Published : Oct 26, 2025, 06:49 AM IST

Chicken Bharta: సండే వ‌చ్చిందంటే చాలా మంది ఇళ్ల‌లో క‌చ్చితంగా చికెన్ క‌ర్రీ ఉండాల్సిందే. అయితే కర్రీ, ఫ్రై, బిర్యానీ వంటివి చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం కొత్తగా “చికెన్ భర్తా కర్రీ” ట్రై చేయండి. ఇంత‌కీ ఏంటిది.? ఎలా చేస్తార‌నేగా మీ సందేహం. 

PREV
15
చికెన్ భ‌ర్తా క‌ర్రీ తయారీకి కావాల్సిన ప‌దార్థాలు

బోన్‌లెస్ చికెన్ – పౌకిలో

నూనె – 2 చెంచాలు

నెయ్యి – అర చెంచా

ఉల్లిపాయలు – 2 (తరిగినవి)

యాలకులు – 2

లవంగాలు – 3

బిర్యానీ ఆకు – 1

దాల్చినచెక్క – చిన్న ముక్క

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1½ చెంచా

పసుపు – అర చెంచా

కారం – 2 చెంచాలు (రుచికి తగ్గట్టు)

జీలకర్ర పొడి – 1 చెంచా

ధనియాల పొడి – 2 చెంచాలు

గరంమసాలా – 1 చెంచా

తందూరి మసాలా – 1 చెంచా

టమాటాలు – 2 (తరిగినవి)

జీడిపప్పు పేస్ట్ – 2 చెంచాలు (నానబెట్టి రుబ్బినది)

గిలకొట్టిన పెరుగు – ¼ కప్పు

కసూరీ మేతి – 1 చెంచా

ఫ్రెష్ క్రీమ్ – 2 చెంచాలు

కొత్తిమీర – తరిగినది కొద్దిగా

25
ముందుగా చికెన్ ఉడికించుకోవాలి.

ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో తగినన్ని నీళ్లు వేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. ప్రెషర్ పోయిన తర్వాత చికెన్‌ను తీసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత చేత్తోనే చిన్న ముక్కలుగా చెక్కుకుని పక్కన ఉంచాలి. ఇలా ఉడికించి ముక్కలుగా చేసిన చికెన్‌తో కర్రీకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది.

35
మసాలా తయారీ

పాన్‌లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. టమాటాలు, ఉప్పు, కారం, పసుపు వేసి లో టూ మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ విడిచే వరకు మగ్గించాలి.

45
చికెన్, గ్రేవీ కలయిక

ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి 5 నిమిషాలు వేయించాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మగ్గిన తర్వాత గరంమసాలా, తందూరి మసాలా, జీడిపప్పు పేస్ట్, పెరుగు వేసి మిక్స్ చేయాలి. జీడిపప్పు పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్ మీద ఉంచి మగ్గించాలి.

55
చివరిగా..

చివర్లో కసూరీ మేతి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి స్లోగా కలపాలి. న‌చ్చితే ఉడ‌క‌బెట్టిన గుడ్డును ముక్క‌లు చేసుకొని కూడా వేసుకోవ‌చ్చు. అంతే.. నోరూరించే హోటల్ స్టైల్ చికెన్ భర్తా కర్రీ రెడీ అయిన‌ట్లే. ఈ కర్రీని అన్నం, జీలకర్ర రైస్, నాన్, రోటీ, చపాతీలతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం ఈ సండేని ఈ స‌రికొత్త వంట‌కంతో మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories