Rice Sponge Cake: మైదా ,పంచదార లేకుండా బియ్యంతో స్పాంజ్‌ కేక్‌ చేసేద్దామా!

Published : Jul 11, 2025, 12:39 PM IST

మైదా, పంచదార లేకుండా బియ్యం, బెల్లంతో హెల్దీ స్పాంజ్ కేక్ తయారీ పద్ధతి తెల్సుకోండి. ఇంట్లోనే ఈజీగా చేస్తారు.

PREV
18
బియ్యం, బెల్లంతో స్పాంజ్ కేక్

కేక్ అంటేనే మైదా, పంచదార తప్పనిసరి అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, మైదా, ప్రాసెస్డ్ షుగర్‌ వంటివి ఎవరూ ఆశించరు. అలాంటి వాళ్ల కోసం, సంపూర్ణంగా బియ్యం, బెల్లంతో మాత్రమే తయారయ్యే స్పాంజ్ కేక్ ఒక చక్కని ప్రత్యామ్నాయం అవుతుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా, పిల్లలకూ ఎంతో బాగా నచ్చుతుంది.

28
పదార్థాలు వంటింటిలోనే

ఈ కేక్ తయారీకి ప్రత్యేకంగా అవసరమయ్యే పదార్థాలు  వంటింటిలోనే ఉంటాయి. బియ్యం, బెల్లం, కొద్దిగా ఉడికించిన అన్నం లేదా మరమరాలు, వంట సోడా, బేకింగ్ సోడా, యాలకుల పొడి, నెయ్యి — ఇవి కలిపితే చాలు, తక్కువ టైమ్‌లో అద్భుతమైన స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది.

38
కేక్‌కు మెత్తదనం

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత బియ్యం నుంచి నీటిని వడగట్టి మిక్సీలో వేసి, రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన అన్నం లేదా పావు కప్పు మరమరాలు కూడా కలిపి మెత్తగా రుబ్బాలి. ఇదే కేక్‌కు మెత్తదనాన్ని తీసుకొచ్చే రహస్యం. అంతేకాక, రెండు యాలకుల పొడి వేస్తే..మంచి సువాసన వస్తుంది.

48
బెల్లం మిశ్రమం

ఇంకో గిన్నెలో బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి పావు కప్పు నీటిలో వేసి మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి సిరప్ లాగా మారే వరకు వేడి చేయాలి. ఆ సిరప్‌ను వడగట్టి, బియ్యం మిశ్రమంలో కలిపితే స్వీట్‌నెస్‌ అద్భుతంగా కలిసిపోతుంది.

58
వంట సోడా ఒక్కటే

ఇప్పుడు బియ్యం మిశ్రమంలో చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది కేక్  మెత్తగా రావడానికి సహాయపడుతుంది. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే, అరస్పూన్ వంట సోడా ఒక్కటే వేసినా సరిపోతుంది.

68
కేక్ తయారీ

స్టౌపై నెయ్యి వేసిన పాన్‌ను హై ఫ్లేమ్‌లో వేడి చేసి, మిశ్రమాన్ని అందులో వేసేయాలి. మొదట 30 సెకండ్లు హై ఫ్లేమ్‌లో ఉంచి, తరువాత గిన్నెను పెద్ద పెనం మీద పెట్టి చిన్న మంటపై 30 నుంచి 40 నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో చెక్ చేస్తూ ఉంటే, కేక్ తయారీ పరిస్థితిని బాగానే అంచనా వేయచ్చు.

కేక్ పూర్తిగా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే, కేక్‌ మీద వేలు పెట్టి చూడాలి. చేతికి అంటుకుంటే ఇంకా వేయించాలి. లేకపోతే స్టవ్ ఆఫ్ చేయొచ్చు. చల్లారిన తర్వాత అంచులు విడదీసి ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది.

78
పిల్లల ఆరోగ్యానికి

ఈ బియ్యం-బెల్లం స్పాంజ్ కేక్ తినగానే నోట్లో కరిగిపోయే రుచిని ఇస్తుంది. అందులోనూ మైదా, పంచదార లేని స్వచ్ఛమైన హోమ్ మేడ్ కేక్ కావడంతో పిల్లల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కలిస్తే, సంప్రదాయ పదార్థాలతో కూడిన ఆధునిక రెసిపీగా ఇది నిలుస్తుంది.

88
ఇంట్లోనే సింపుల్‌ గా

ఇంట్లోనే సింపుల్‌ గానే తయారయ్యే ఈ కేక్‌, పిల్లల బర్త్‌డేలు, చిన్న వేడుకలు, స్పెషల్‌ లంచ్‌లు వంటి సందర్భాల్లో పెట్టినా బాగుంటుంది. ఈ రెసిపీని ఫాలో అయితే మీరు బేకరీలో కొనే కేక్‌కి సమానంగా ఉండే స్పాంజీ టెక్స్చర్‌, రుచిని ఇంట్లోనే సులభంగా పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories