Black Coffee: నెల రోజులు క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుంది?

Published : Jul 10, 2025, 03:28 PM ISTUpdated : Jul 10, 2025, 04:48 PM IST

బ్లాక్ కాఫీ తాగడం ఫిట్‌నెస్ , బరువు నిర్వహణకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.

PREV
15
Black Coffee

కాఫీని ఇష్టపడేవాళ్లు మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా? పాలు, పంచదార లేకుండా చేసే ఈ బ్లాక్ కాఫీ పెద్దగా ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ.. ఆరోగ్యానికి మాత్రం చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. మరి.. ఒక నెల పాటు.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

25
పరిశోధన ఏం చెబుతోంది..?

కాఫీలోని కెఫిన్ మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. రోజుకు 3 కప్పుల కాఫీ తాగడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు చూపించాయి. ఇక బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉండవచ్చు. హెల్త్‌లైన్ ప్రకారం కాఫీలోని మూలకాలు మనకు తక్షణ శక్తిని ఇస్తాయి. ప్రతిరోజూ తీసుకుంటే, శరీరంలోని శక్తి స్థాయిలు చాలా కాలం పాటు ఎక్కువగా ఉంటాయి. పబ్‌మెడ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కెఫిన్ మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. వాస్తవానికి, పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు కాఫీ తాగడానికి ఇవ్వగా, వారిలో అలసట తగ్గినట్లు గుర్తించారు.

35
నిపుణులు ఏమి చెబుతారు?

బ్లాక్ కాఫీ తాగడం ఫిట్‌నెస్ , బరువు నిర్వహణకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది యువతకు ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది. కావాలంటే.. బరువు తగ్గాలి అనుకునేవారు  బ్లాక్ కాఫీకి నిమ్మరసం జోడించవచ్చు.అసిడిటీ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే సరిపోతుంది.

45
ఒక నెల పాటు ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

టైప్ 2 డయాబెటిస్

రోజువారీ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కొద్దిగా తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి.

మెదడు ఆరోగ్యానికి ప్రయోజనాలు

బ్లాక్ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు కనుగొన్నారు. అందువల్ల, ప్రతిరోజూ దీన్ని తాగడం వల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

55
బరువు నిర్వహణ..

బరువు తగ్గడానికి కూడా బ్లాక్ కాఫీ చాలా బాగా సహాయపడుతుంది. ఈ కాఫీ జీవక్రియను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. మంచి జీవక్రియ ఉన్నవారికి బరువు పెరిగే సమస్య ఉండదని నిపుణులు కూడా చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తున్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కూడా చాలా ఈజీగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

చర్మానికి ప్రయోజనాలు..

కాఫీ తాగడం వల్ల మన శరీరానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మనకు అందాన్ని కూడా తెస్తుంది. కాలేయం , ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉండటం కూడా  మన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మీరు రెగ్యులర్ గా బ్లాక్ కాఫీ తాగితే.. చర్మం సహజంగా నిర్విషీకరణ చెందుతుంది. రెగ్యులర్ గా బ్లాక్ కాఫీ  తాగడం వల్ల మీ ముఖం అందంగా మారుతుంది. మొటిమల సమస్య ఉండదు. స్కిన్ మెరుస్తూ కనపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories