ఊరగాయ ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఊరగాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఊరగాయ, నెయ్యి కాంబనేషన్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ప్రతిరోజూ కొద్దిగా ఊరగాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.
బలమైన ఎముకల కోసం..
ఊరగాయలో విటమిన్ 'కె' పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఊరగాయలో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
నాడీ వ్యవస్థకు మేలు
ఊరగాయలోని పొటాషియం నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షిస్తాయి. ఊరగాయలోని కాల్షియం శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యానికి..
ఊరగాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చాలామంది చెబుతుంటారు. అంతేకాదు ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.