Summer Tips: ఎండాకాలంలో బాడీ డీహైడ్రేట్ అవ్వొద్దంటే ఏం చేయాలి?

Published : Apr 19, 2025, 02:42 PM IST

ఎండాకాలంలో చాలా మంది డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటారు. మరి ఈ డీ హైడ్రేషన్ సమస్య రాకుండా,  ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ముఖ్యంగా ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో చూద్దాం..

PREV
15
Summer Tips: ఎండాకాలంలో బాడీ డీహైడ్రేట్ అవ్వొద్దంటే ఏం చేయాలి?


వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం తొందరగా వేడెక్కడం, చెమటలు పట్టడం ద్వారా శరీరంలోని నీరు, ఖనిజ లవణాలు కోల్పోవడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది మొదట తలనొప్పి, అలసట, నీరం, దాహం ఎక్కువగా వేయడం వంటి లక్షణాలతో మొదలౌతుుంది. తర్వాత లోబిపీ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మరి, ఈ సీజన్ లో శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25


1. మజ్జిగ 

ఎండాకాలంలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్ ఏదైనా ఉంది అంటే అది మజ్జిగ.మీరు తాగే మజ్జిగలో వేయించిన జీలకర్ర, నల్లమిరియాలు, కొత్తిమీర కలిపి తీసుకుంటే.. శరీరం చాలా తొందరగా చల్లపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో నీటి నష్టాన్ని తగ్గిస్తుంది. చాలా ఎనర్జిటిక్ గా మారుస్తుంది. డీ హైడ్రేషన్ సమస్య అనేది రాదు.
 

35


2. ఉల్లిపాయలు
ఉల్లిపాయలు సహజ శీతలకారకాలు. రోజూ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటే వేడికి తట్టుకునే శక్తి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వేసవిలో జేబులో ముడి ఉల్లిపాయలు పెట్టుకుని బయటకు వెళ్లడం మనం చూస్తుంటాం. ఇది ఎండదెబ్బనుంచి రక్షణ కలిగిస్తుందని నమ్మకం.
 

45
jeera lemon water


3. నిమ్మరసం 

వేసవి కాలంలో  రోజుకు కనీసం ఒకసారి నిమ్మరసం తాగడం మంచిది. నల్ల ఉప్పు, కొద్దిగా చక్కెర కలిపి తయారుచేసిన నిమ్మకాయ నీరు  శరీరంలోని సోడియం లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది. బాడీ డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

4. నీటి శాతం ఎక్కువగా కలిగిన పండ్లు
పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లలో 90% కంటే ఎక్కువ నీటి శాతం ఉంటుంది. వీటిని మధ్యాహ్నం స్నాక్స్‌గా నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ హైడ్రేషన్ లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలోనూ, వేసవి తాపాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

55
Coconut water

5. బిల్వ పానకం 
బెల్లం, బిల్వ పండ్ల గుజ్జుతో తయారయ్యే బిల్వ పానకం కడుపులో మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ సంబంధిత సమస్యల నివారణకు మంచిది. వేసవిలో ఒక్క గ్లాస్ బిల్వ పానకం శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

6. కొబ్బరి నీరు 
వేసవి ఉష్ణోగ్రతల్లో ఎలక్ట్రోలైట్‌ల సమతుల్యత చాలా అవసరం. కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ, వేడి వల్ల వచ్చే తలనొప్పులను తగ్గించడంలోనూ దోహదపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories