పాలను పిల్లలు, పెద్దలు అంటూ ప్రతి ఒక్కరూ తాగొచ్చు. వీటిలో ఉండే కాల్షియం, ప్రోటీన్లు వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పాలలో ట్రిఫ్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మనల్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఐదేళ్లలోపున్న పిల్లలు పరిగడుపున పాలను తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడు తాగకూడదు.
నిపుణుల ప్రకారం.. ఎదిగే పిల్లలు ఉదయాన్నే ఒక గ్లాస్ పాలను తాగడం మంచిది. దీనివల్ల పిల్లలు శక్తివంతంగా, రోజంతా చురుగ్గా ఉంటారు.
రాత్రిపూట పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు గ్లాస్ పాలను తాగడం మంచిది. ఇది మీ శరీరాన్ని రిలాక్స్ గా ఉంచి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు లేదా శారీరక శ్రమ తక్కువగా చేసేవారు పాలను పగటిపూటే తాగడం మంచిది.
ఇకపోతే వ్యాయామం చేసేవారు పాలను వ్యాయామం తర్వాత తాగడమే ఉత్తమం. ఇది కండరాలను బలంగా చేస్తుంది. అలాగే శరీర రికవరీకి సహాయపడుతుంది.
నెలపాటు చక్కెర తినకుండా ఉంటే ఇదే జరుగుతుంది
చిలగడదుంపలు చాలా మంచివి.. అయినా వీళ్లు మాత్రం తినకూడదు
ఆవు పాలు vs గేదె పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?
పనీర్ ను ఎక్కువగా తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త