
ఆపిల్ పండు లాగే రోజూ ఒక అరటిపండును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఈ పండులో ఐరన్, కాల్షియం, ఫైబర్,పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.
అయితే చాలా మంది వీటిని డజన్ లేదా రెండు డజన్లను ఒకే సారి కొని ఇంట్లో నిల్వ చేసుకుని తింటుంటారు. అయితే అరటిపండ్లను కొని తెచ్చిన ఒకటి రెండు రోజులకే ఇవి బాగా పండిపోయి తొక్క కొంచెం కొంచెం నల్లగా అవుతుంటుంది. ఇలాంటి వాటిని మనం చెత్త బుట్టలో వేస్తుంటాం.
ఎందుకంటే ఇవి పాడైపోయాయని. నిజానికి బాగా పండిన అరటిపండ్లను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ బాగా పండిన అరటిపండ్లే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కణాల నష్టాన్ని నివారిస్తుంది
బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాాంటి అరటిపండ్లను తింటే మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనకు అంటువ్యాధులు, ఇతర రోగాలు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చేప్రమాదం తగ్గుతుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు బాగా పండిన అరటిపండును తింటే మంచిది.
బాగా పండిన అరటిపండ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఎందుకంటే బాగా పండిన అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మనకు గుండె జబ్బులు రాకుండా పాడుతాయి.
బాగా పండిన అరటిపండ్లు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. బాగా పండిన అరటిపండ్లలో ఉండేపిండి పదార్థాలు చాలా సులువుగా జీర్ణం అవుతాయి. ఇవి మన శరీరానికి వెంటనే శక్తిని అందించడానికి సహాయపడతాయి. అంతేకాదు జీర్ణ సమస్యలు ఉన్నవారికి బాగా పండిన అరటిపండు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండును తింటేీ జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.గట్ లో మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది.
గుండెల్లో మంట సమస్యతో బాధపడేవారికి బాగా పండిన అరటిపండు మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే కొన్ని గుణాలు గుండెల్లో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి. ఈ పండు మన కడుపులోని లోపలి పొరను హానికరమైన ఆమ్లాల నుంచి రక్షిస్తుంది. కాబట్టి మీకు ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉంటే బాగా పండిన అరటిపండును రోజూ ఒకటి తినండి. సమస్య తొందరగా తగ్గుతుంది.
కండరాల నొప్పులతో బాధపడేవారికి బాగా పండిన అరటిపండు చాలా మంచిది. రోజూ ఒక పండిన అరటిపండును తింటే కండరాల నొప్పులు తగ్గుతాయి. దీనిలో పుష్కలంగా ఉండే పొటాషియం కంటెంట్ కండరాల నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
బాగా పండిన అరటిపండు మన శరీరానికి అవసమైన పోషకాలను అందించడమే కాకుండా.. మన శరీరాన్ని క్యాన్సర్ నుంచి కాపాడటానికి కూడా సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. బాగా పండిన అరటిపండును తింటే క్యాన్సర్, ఇతర వ్యాధుల కణాల పెరుగుదల తగ్గుతుంది. క్యాన్సర్ కు దూరంగా ఉండాలంటే రోజూ ఒక అరటిపండును తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు.
మెదడు ఆరోగ్యానికి మేలు
బాగా పండిన అరటిపండును తింటే మన మెదడు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. దీనిలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది సెరోటొనిన్, డోపమైన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి మనల్ని ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
చర్మం, జుట్టుకు మేలు
బాగా పండిన అరటిపండులోని విటమిన్లు, ఖనిజాలు మన జుట్టుకు, చర్మానికి కూడామేలు చేస్తాయి. బాగా పండిన అరటిపండును మెత్తని గుజ్జు చేసి ముఖానికి,జుట్టుకు మాస్క్ గా వేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ముఖం హైడ్రేట్ గా, నీట్ గా అవుతుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.