Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ వీళ్లకు విషం లాంటిదే.. అస్సలు తాగకూడదు

Published : Oct 02, 2025, 09:55 AM IST

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తాగడం వల్ల వెయిట్ లాస్ నుంచి శరీరంలో రక్తం పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొంతమంది ఈ బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది వీళ్లకు విషం లాగా పనిచేస్తుంది. 

PREV
17
బీట్ రూట్ జ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్

బీట్ రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. దీన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇలా ఎన్నో విధాలుగా బీట్ రూట్ జ్యూస్ సహాయపడుతుంది. కానీ ఇంతటి హెల్తీ జ్యూస్ కొంతమందికి మాత్రం విషం లాగ పనిచేస్తుంది. అసలు దీన్ని ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

27
తక్కువ రక్తపోటు ఉన్నవారు

అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గించడానికి, నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అదే తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తాగితే బీపీ మరింత తగ్గుతుంది. అందుకే వీరు తాగకూడదు. 

అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి మందులను వాడే వారు కూడా బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదు. ఎందుకంటే ఇది బీపీ మరింత తగ్గించి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.బీపీ తక్కువగా ఉన్నవారు, బీపీ మందులను వాడేవారు ఈ జ్యూస్ ను తాగితే తలతిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. 

37
అలెర్జీ ఉన్నవారు

కొంతమందికి బీట్ రూట్ కూడా పడకపోవచ్చు. అంటే దీనికి కూడా అలెర్జీ ఉండొచ్చు. ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, దురద వంటి సమస్యలు వస్తాయి. 

47
జీర్ణ సమస్యలు

బీట్ రూట్ ఫైబర్ కు మంచి వనరు. కానీ ఇది కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారిపై చెడు ప్రభావం చూపుతుంవది. అందుకే ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. 

57
డయాబెటీస్ పేషెంట్లు

బీట్ రూట్ జ్యూస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ుంది. అందుకే డాక్టర్ ను సంప్రదించకుండా డయాబెటీస్ ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదు. 

67
சிறுநீரக பிரச்சனை உள்ளவர்கள்

మీకు ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉంటే బీట్‌రూట్ జ్యూస్ అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయని చెబుతారు.

77
మూత్రం ఎర్రగా

కొంతమందికి బీట్ రూట్ జ్యూస్ ను ఎక్కువగా తాగితే మూత్రం ఎర్రగా వస్తుంది. మీకు కూడా ఇలా అయితే వెంటనే దీన్ని తాగడం మానేయాలి. 

Read more Photos on
click me!

Recommended Stories