Moringa : మునగాకుల పొడి రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!

Published : Apr 26, 2025, 01:02 PM IST

మునగాకుల్లో విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి, చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి.

PREV
15
Moringa : మునగాకుల పొడి రోజూ  తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!

మునగకాయల తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు.  ముఖ్యంగా సాంబార్ చేయాలంటే మునగకాయ ఉండాల్సిందే.మునగకాయలో ఎన్ని పోషకాలు ఉంటాయో.. దానికి రెట్టింపు పోషకాలు దాని ఆకుల్లో ఉంటాయి. చాలా మంది ఆ చెట్టు ఆకులను పెద్దగా పట్టించుకోరు. కానీ, దానిలో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.  ఈ చెట్టు ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు ఈ చెట్టు ఆకులను మన డైట్ లో భాగం చేసుకుంటే..మన శరీరానికి అవసరం అయ్యే శక్తి మొత్తం లభిస్తుంది. ఆయుర్వేదంలో ఈ మునగాకులను జ్వరం, జీర్ణ సంబంధిత సమస్యలకు చికిత్సగా ఉపయోగించేవారు. మరి, ప్రతిరోజూ ఈ ఆకులను డైరెక్ట్ గా లేదంటే పొడి రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
 

25


మునగాకులో పోషకాలు..

మునగాకుల్లో విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి, చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లోపాలు ఉన్నవారు కూడా రోజూ ఈ మునగాకులను డైట్ లో భాగం చేసుకుంటే చాలు.

35

మునగ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు
మునగ ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ ఆకులు మన శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి. ఈ ఆకుల్లో  కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మునగ ఆకులను తిన్న తర్వాత, మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.  అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలు కూడా రావు.
 

45

వైద్య అధ్యయనాల ప్రకారం, మునగ ఆకులు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక.
కాల్షియం , భాస్వరం లోపం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ సమస్యకు ఈ ఆకులు మంచి వైద్యంలా పని చేస్తాయి. 

మునగ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ E మన చర్మాన్ని ప్రకాశవంతంగా, మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సూపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి.
 

55

మునగాకులను ఎలా తీసుకోవచ్చు..?

డైరెక్ట్ గా మునగాకులను కూరలా వండితే తీసుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఆకులను ఎండపెట్టి, పొడిలా చేసుకొని.. మనం వండుకునే కూరల్లో వేసుకోవచ్చు. సూప్ ల్లాంటి వాటిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మునగాకు కారప్పొడి లాంటివి చేసుకొని ఇడ్లీ, దోశ లాంటి వాటిల్లో భాగం చేసుకొని తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories