
Ivy Gourd Benefits: మనకు దొరికే చాలా రకాల కూరగాయల్లో దొండకాయ ఒకటి. ఈ దొండకాయను తింటే బుద్ధి పెరగదని, మతిమరుపు వస్తుందని చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ కూరగాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో ఎక్కువగా లభించే ఈ కూరగాయలో ఫైబర్, నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ,బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాదు.. రెగ్యులర్ గా దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
1.దొండకాయలో పోషకాలు...
దొండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.ఈ దొండకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా.. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలను బలంగా మారుస్తాయి.
2.రక్తంలో షుగర్ లెవల్స్
దొండకాయలు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా, గ్లూకోజ్ శోషణను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెరను (blood sugar) నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.ఎలాంటి భయం లేకుండా వారు దొండకాయ తినవచ్చు. అంతేకాదు, దొండకాయ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటంతో శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ఈ కూరగాయలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దొండకాయ ఆకలిని నియంత్రిస్తుంది. బరువును (Weight loss) సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల అదనపు క్యాలరీలు పెరిగే ప్రమాదం తప్పుతుంది. దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు.
4. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది
దొండకాయలో బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు (antioxidant) ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
5. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది
దొండకాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, ఇతర వాపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఎముకలు, కీళ్లను బలంగా చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
6. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
దొండకాయలో ఉండే హెపాటోప్రొటెక్టివ్ (Hepatoprotective) గుణాలు కాలేయాన్ని బలంగా చేస్తాయి. విష పదార్థాలు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడతాయి. ఇది కాలేయ పనితీరును సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
7. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
ఫైబర్ అధికంగా ఉండే దొండకాయ జీర్ణవ్యవస్థను సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.
8. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం
దొండకాయను సాంప్రదాయకంగా ఆస్తమా (Asthma), బ్రోన్కైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గించడానికి సహాయపడతాయి.
9.రోగనిరోధక శక్తిని పెంచుతుంది
విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. దొండకాయను క్రమం తప్పకుండా తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి.
10. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
దొండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.దొండకాయను కూరగానో, పచ్చడిగానో, వేపుడుగానో వండుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి, దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.