ఆంబూర్ బిర్యానీ అంటే మెత్తటి రుచి, తక్కువ మసాలా, అదిరిపోయే వాసనతో ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకం. ఇది తమిళనాడులో ఇది చాలా ఫేమస్. జీలకర్ర బియ్యంతో తయారు చేయడమే ఈ బిర్యానీ సీక్రెట్. తక్కువ మసాలా, ఎక్కువ టేస్ట్ ఉండటం వల్ల తమిళనాడులో ఈ బిర్యానీని చాలా మంది ఇష్టపడతారు. కొవ్వు లేకుండా ఎక్కువ కారంతో తయారు చేసే ఈ బిర్యానీ వాసనతోనే అందరినీ ఆకర్షిస్తుంది.
కావాల్సిన పదార్థాలు :
మటన్/చికెన్ – 500 గ్రాములు, జీలకర్ర బియ్యం – 2 కప్పులు, నువ్వుల నూనె / నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, పెద్ద ఉల్లిపాయలు – 2 (ముక్కలు), టమాటా – 2 (ముక్కలు), పచ్చిమిర్చి – 4, పుదీనా, కొత్తిమీర – 1 గుప్పెడు, పెరుగు – 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టేబుల్ స్పూన్లు, పసుపు – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
ఇది కూడా చదవండి పనీర్ నుండి పాలకూర వరకు 7 టేస్టీ వెజ్ కబాబ్స్ ఇలా తయారు చేయండి
మసాలా దినుసులు:
మిరియాలు – 1/2 టీస్పూన్, జీలకర్ర – 1/2 టీస్పూన్, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క – 1 ముక్క, సోంపు – 1/2 టీస్పూన్.
ఆంబూర్ బిర్యానీ తయారీ విధానం:
ముందుగా మసాలా తయారీకి పదార్థాలను వేయించి, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మటన్‌ను శుభ్రం చేసి పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. దీనివల్ల మటన్ మెత్తగా అవుతుంది. కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, మసాలా పొడి, కారం వేసి బాగా వేయించాలి.
నానబెట్టిన మటన్‌ను వేసి 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బియ్యాన్ని కడిగి, తగినంత నీరు వేసి మరిగించాలి. పుదీనా, కొత్తిమీర వేసి, బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.
వడ్డించే విధానాలు:
క్యారెట్, ఉల్లిపాయ రైతా ఆంబూర్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్. మటన్ సాల్నా బిర్యానీతో సూపర్ గా ఉంటుంది.
ముఖ్యమైన సూచనలు:
జీలకర్ర బియ్యం తప్ప, బాస్మతి వాడితే ఆంబూర్ బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. మసాలా తక్కువగా ఉండడం వల్ల మటన్ బాగా ఉడకాలి. అప్పుడే రుచి బాగుంటుంది.
ఇది కూడా చదవండి బిర్యానీకి పోటీ ఇచ్చే కర్ణాటక స్టైల్ టొమాటో బాత్.. ఎలా తయారు చేయాలంటే..