మఖానా ప్రోటీన్ కి మంచి సోర్స్. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగౌతుంది. గుండె, ఆరోగ్యం, మెదడు పనితీరుకు సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు..
మఖానాలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కుంటాయి, వాపును తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని సాధించడంలో సహాయపడతాయి, అకాల వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఆరోగ్యంతో పాటు, అందాన్ని పెంచడంలోనూ సహాయపడతాయి.