Guava: చలికాలంలో తరచుగా లభించే జామకాయలో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే, వీటిని మితంగా తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
అధిక పోషకాలు ఉండే పండ్లలో జామకాయలు కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ పండ్లను అమృత ఫలం అని కూడా పిలుస్తారు. ఇతర పండ్లతో పోలిస్తే.. ఈ జామకాయ చౌకగా లభిస్తుంది. దీనిలో విటమిన్లు, ఫైబర్, ఇతర ఖనిజాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి, బాగా పండిన జామపండు తింటే ఏమౌతుంది? కలిగే లాభాలు ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
25
జామ పండులో పోషకాలు..
నారింజ కంటే జామకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పండులో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
35
కొలెస్ట్రాల్ తగ్గుతుంది...
జామకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది.
బీపీ కంట్రోల్ లో ఉంటుంది....
పోటాషియం పుష్కలంగా ఉండే జామ పండు రక్త పోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం శీరరంలో సోడియం ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. రక్త నాళాలను సడలిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపై అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇక ఈ పండులో ఉండే ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి కూడా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.
జామకాయలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండటానికి సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా జామకాయ తినొచ్చు. జామకాయలోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను మందగించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
55
అధిక బరువు తగ్గించే జామపండు...
జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల మీరు ఎక్కువసేపు కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. దీని వల్ల జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఫలితంగా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.