ఆకుకూరలు వాడిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో కావాల్సిందే!

Published : Oct 31, 2025, 06:38 PM IST

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలుసు. కానీ అవి త్వరగా వాడిపోతుంటాయి. దానివల్ల వాటిలోని పోషకాలు కూడా తగ్గిపోతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఆకుకూరలను ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉంచవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

PREV
15
ఆకుకూరలు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?

సాధారణంగా మనం ఆకుకూరలను మార్కెట్ లో కొనుగోలు చేసేటప్పుడు పచ్చగా, మంచి వాసనతో ఉంటాయి. కానీ మనం ఇంటికి తీసుకొచ్చి ఒక్క రోజు పక్కన పెట్టినా చాలు.. వాడిపోతుంటాయి. దానివల్ల కొన్నిసార్లు ఆకుకూరలను పడేయాల్సి వస్తుంటుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఆకుకూరలను 7 నుంచి 10 రోజులవరకు తాజాగా ఉంచుకోవచ్చు.

25
కడిగే విధానం

చాలామంది ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ అది చాలా పెద్ద తప్పు. నీటిలో తడిసిన ఆకులు త్వరగా పాడవుతాయి. కాబట్టి ముందుగా ఆకుకూరల మీద ఉన్న దుమ్ము లేదా కీటకాలు పోయేలా పొడి క్లాత్ తో తుడవాలి. ఆకుకూరలు వాడే ముందు మాత్రమే కడగాలి. ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

35
పేపర్‌లో చుట్టాలి

ఫ్రిజ్‌లో ఆకుకూరలు నేరుగా పెట్టడం వల్ల తేమ ఎక్కువై ఆకులు వాడిపోతాయి. అందుకే వాటిని పేపర్ లో చుట్టి పెట్టాలి. పేపర్ అదనపు తేమను పీల్చేసి ఆకుల తాజాదనాన్ని కాపాడుతుంది. కొత్తిమీరను చిన్నగా కట్ చేసి ప్లాస్టిక్ బాక్స్‌లో పెడితే 5–6 రోజులు తాజాగా ఉంటుంది. దాంతోపాటు ఫ్రిజ్ టెంపరేచర్‌ను సెట్ చేసుకోవడం కూడా ముఖ్యం. చల్లదనం ఎక్కువైతే.. ఆకుకూరలు ఫ్రీజ్ అయి వాడిపోతాయి. కాబట్టి సరైన ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలి.

45
నీటిలో నిల్వ చేయడం

కొత్తిమీర, పుదీనా వంటి సున్నితమైన ఆకుకూరలను నీటిలో నిల్వ చేయవచ్చు. గాజు గ్లాస్‌లో తక్కువ నీరు పోసి కూర కాడలను అందులో ముంచి, పైభాగం మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్రతి రెండు రోజులకు నీరు మారిస్తే.. ఆకులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

ఫ్రిజ్‌లో ఆకుకూరలు ఉంచే బాక్స్‌లో చిన్న బియ్యం ప్యాకెట్ లేదా సిలికా జెల్ ప్యాక్ ఉంచవచ్చు. ఇవి తేమను పీల్చి కూరల నిల్వ కాలాన్ని పెంచుతాయి. కానీ ఆ ప్యాకెట్ కూరలను నేరుగా తాకకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఆకుకూరలను వాడేముందు ఉప్పు కలిపిన నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. ఇది ఆకులపై ఉన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

55
ఎక్కువ రోజులు నిల్వచేయాలంటే?

పాలకూర, మెంతికూర లాంటివి ఎక్కువ రోజులు నిల్వచేయాలంటే వాటిని కొద్ది సేపు వేడి నీటిలో పెట్టి.. ఆ తర్వాత చల్లటి నీటిలో వేసి తుడిటి రంధ్రాలున్న ప్లాస్టిక్ కవర్లలో ఉంచి ఫ్రీజర్‌లో పెట్టాలి. వాడే రోజున బయటకి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆకులు కొంచెం వాడిపోతే వాటిని పారేయకుండా చల్లటి నీటిలో ఐస్ క్యూబ్స్ వేసి 10 నిమిషాలపాటు నానబెడితే అవి మళ్లీ పచ్చగా, తాజాగా మారుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories