Custard Apple: చలికాలంలో రోజూ ఒక సీతాఫలం ఎందుకు తినాలి..?

Published : Nov 11, 2025, 06:03 PM IST

 Custard Apple: సీతాఫలం రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదు.. దీనిని సరిగా తింటే ఈజీగా బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
సీతాఫలం..

చలికాలం వచ్చింది అంటే సీతాఫలం సీజన్ వచ్చినట్లే. మార్కెట్లో రుచికరమైన సీతాఫలం అందుబాటులో ఉంది. ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగా ఫైబర్ అధికంగా ఉండటం, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల, సీతాఫలం తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. రోజుకి కనీసం ఒక సీతాఫలం తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

26
ఆకలిని నియంత్రించే ఫైబర్...

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనిని తినడం వల్ల.. ఇతర చిరు తిండ్లు తినాలనే కోరిక తగ్గిపోతుంది. కడుపు నిండుగా ఉండటంతో పాటు..... ఈ పండులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

36
పుష్కలంగా పోషకాలు...

సీతాఫలం రుచికి చాలా తియ్యగా ఉంటుంది. అంతేకాదు.. అందులో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల విటమిన్ సి, బి కాంప్లెక్స్ , పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అందుతాయి. దీనిని మితంగా తింటే కచ్చితంగా బరువు అందుబాటులో ఉంటుంది.

46
జీవక్రియకు సహజ మద్దతు

సీతాఫలంలో ఉన్న పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలోని జీవక్రియ రేటును సమతుల్యం చేస్తాయి. ఇవి కండరాల పనితీరును మెరుగుపరచి, కొవ్వు కాల్చే ప్రక్రియకు సహాయపడతాయి. అంటే, ఈ పండు కేవలం తీపి కాదు, మీ శరీరం శక్తివంతంగా పనిచేయడానికి ఇంధనం అందిస్తుంది.

అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులు

మీరు సాధారణంగా రొట్టె, బంగాళాదుంపలు వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలకు బదులు కస్టర్డ్ ఆపిల్‌ను తీసుకోవడం మంచి నిర్ణయం. ఇది రక్త చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా, మొత్తం కేలరీలు తగ్గుతాయి, పొట్ట చుట్టూ నిల్వ అయ్యే కొవ్వు తగ్గుతుంది.

56
పేగు ఆరోగ్యానికి మద్దతు

సీతాఫలంలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేయడంలో సహాయపడుతూ, ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తుంది. ఈ విధంగా మీరు అతిగా తినకుండా, బరువును నియంత్రించవచ్చు.

యాంటీఆక్సిడెంట్ల ప్రభావం

సీతాఫలంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు , ప్లాంట్ కంపౌండ్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి. దీని ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వ తగ్గుతుంది. చర్మం మెరిసేలా మారుతుంది.

66
నేచురల్ షుగర్స్...

ప్రాసెస్ చేసిన స్వీట్ల మాదిరిగా కాకుండా, సీతాఫలంలోని చక్కెరలు ఫైబర్ , పోషకాలతో కలిపి ఉంటాయి. ఇవి రక్త చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచవు, అందువల్ల ఆకలి నియంత్రణలో సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories