Anti Cancer Foods: ఇవి సాధారణ ఆహారాలే.. కానీ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సత్తా ఉంది

Published : Nov 11, 2025, 10:28 AM IST

Anti Cancer Foods: క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కొన్ని ఆహారాల్లో ఉంటుంది. వీటిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు తక్కువ. వీటిని ప్రతిరోజూ తింటే మంచిది.

PREV
16
యాంటీ క్యాన్సర్ ఫుడ్స్

క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా మారింది. ఇది శరీరంలో చేరిందంటే ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణ కణాలు నిరంతరం పెరుగుతూ గడ్డల రూపంలో పేరుకుపోతాయి. ఇదే క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి. ఈ గడ్డలు సమీప కణజాలాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ కణాలు రక్తం లేదా లింఫ్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఒకసారి క్యాన్సర్ వచ్చాక దానిని పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. క్యాన్సర్ రాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు ప్రతిరోజూ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.

26
కాలీఫ్లవర్, క్యాబేజీ

క్రూసిఫెరస్ జాతికి చెందిన బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి వాటిని తింటే ఎంతో మంచిది. వీటిలోశక్తివంతమైన క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. వీటిలో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీనికి ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నివారిస్తుంది.

36
బ్రోకలీ

బ్రోకలీ కాస్త ఖరీదైనదే. దీన్ని ప్రతిరోజూ తింటే ఎంతో మంచిది. దీన్ని తింటే రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రోకలీ తినడం వల్ల శరీరంలోని హార్మోన్లు కూడా సమతుల్యం అవుతాయి. ఇది తినడం వల్ల కాలేయంలోని విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. వీలైనంత వరకు కనీసం వారానికి ఒకసారైనా బ్రోకలీ తినేందుకు ప్రయత్నించాలి. 

46
వెల్లుల్లి

ప్రతి ఇంట్లో వెల్లుల్లి కచ్చితంగా ఉంటుంది. ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  వెల్లుల్లి ఎంతో శక్తివంతమైన ఆహారం. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లిని కోసినప్పుడు, దానిలోని సల్ఫర్ సమ్మేళనాలు విడుదలవుతాయి. అందులో ఉండే అల్లిసిన్ ఎంతో ముఖ్యమైంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. అలాగే డీఎన్ఏను మరమ్మతు చేస్తుంది. శరీరంలోని అవసరం లేని కణాల పెరుగుదలను వెల్లుల్లి అడ్డుకుంటుంది. వెల్లుల్లిని ప్రతి రోజూ తింటే కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.  వెల్లుల్లిని కోసి 10 నిమిషాలు ఉంచాక తింటే శరీరానికి పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి.

56
క్యారెట్లు

క్యారెట్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కెరోటినాయిడ్లు ఉంటాయి. క్యారెట్‌కు బీటా కెరోటిన్ నారింజ రంగును ఇస్తుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యారెట్‌లోని గుణాలు కూడా వెల్లుల్లిలాగే క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఊపిరితిత్తులు, కడుపు, ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని ఫైటోకెమికల్స్, లుటిన్, పాలీఅసిటలీన్‌లకు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ట్యూమర్ గుణాలు ఉన్నాయి. దీన్ని సలాడ్‌లా తినొచ్చు. పచ్చిగా తింటే ఇంకా మంచిది.

66
బెర్రీలు

మార్కట్లో బెర్రీ జాతి పండ్లు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ ఇలా బెర్రీ జాతి పండ్లు ఏవి తిన్నా మంచిదే. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి డీఎన్ఏను రక్షిస్తాయి. టమాటోలోని లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. పసుపు, గ్రీన్ టీ, వాల్‌నట్స్, బాదం, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్, బీన్స్ కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదు…వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ముఖ్యం. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. పంచదార కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలి. మద్యపానం తగ్గించాలి. కంటినిండుగా నిద్రపోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories