1.టాక్సిన్స్ తొలగిస్తుంది..
ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. మన జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బాడీని కూల్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇక, ఈ జ్యూస్ లో నిమ్మకాయ రసం కూడా కలపడం వల్ల దానిలోని విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ తో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచే ప్రభావాన్ని పెంచుతుంది. అంతేకాదు, ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
హైడ్రేషన్ ,ఎలక్ట్రోలైట్ బూస్ట్
బూడిద గుమ్మడికాయ దాదాపు 96 శాతం నీటితో తయారౌతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం చాలా హైడ్రేటింగ్ గా చేస్తుంది. ఈ జ్యూస్ ని ఉదయాన్నే తాగడం మంచిది. ఎందుకంటే, గంటల తరపడి నిద్రపోయిన తర్వాత శరీరం కొద్దిగా డీ హైడ్రేట్ అవుతుంది. అందుకే, ఆ సమయంలో ఇది తాగితే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది.