కాఫీకి ప్రత్యామ్నాయం: కొందరికి పదేపదే కాఫీ తాగడం అలవాటు. కానీ కాఫీలో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు వైద్య నిపుణులు. మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే.. డికాఫ్ కాఫీ. సురక్షితమైన డీకాఫినేషన్ పద్ధతులను ఎంచుకోవడం ద్వారా రసాయనాల ప్రభావాన్ని నివారించవచ్చు.
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. తక్షణం శక్తి కోసం ఇచ్చినా దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డీకాఫినేటెడ్ కాఫీ అనేది దీనికి మంచి ప్రత్యామ్నాయం. డికాఫ్ కాఫీ ఎంత ప్రయోజనకరం? దాని ప్రయోజనాలు, నష్టాలను పరిశీలిద్దాం.
24
కెఫీన్ దుష్ప్రభావాలు
శరీరం కెఫీన్‌కు ప్రతికూలంగా స్పందించడం లక్షణాలు:
ఆందోళన, చంచలత్వం
వేగవంతమైన హృదయ స్పందన
జీర్ణకోశ సమస్యలు
నిద్రలేమి
తలనొప్పి, మైకం
కెఫీన్‌కు సున్నితంగా ఉండేవారికి, డీకాఫినేటెడ్ కాఫీ మంచి ఎంపిక.