Good Mutton: మంచి మ‌ట‌న్ అంటే ఏంటి.? దానిని ఎలా గుర్తించాలి.? మేకలో ఏ భాగాలను కొనుగోలు చేయాలి.

Published : Jan 06, 2026, 09:58 AM IST

Good Mutton: చాలా మందికి మ‌ట‌న్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే స‌రైన మ‌ట‌న్‌ను ఎలా ఎంచుకోవాలో తెలియ‌క దాని జోలికి వెళ్ల‌కుండా చికెన్ తింటుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మంచి మ‌ట‌న్‌ను గుర్తించ‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
16
తాజా మటన్ ఎంచుకోవడం ఎందుకు అవసరం?

చికెన్‌తో పోల్చుకుంటే మ‌ట‌న్ చాలా ఎక్కువ ధ‌ర ఉంటుంది. అందుకే నాణ్య‌మైన‌, తాజా మ‌ట‌న్‌ను ఎంచుకోవాల‌ని చూస్తారు. అందులోనూ ఆన్‌లైన్‌లో డెలివ‌రీ అందుబాటులోకి వ‌చ్చిన ప్ర‌స్తుత రోజుల్లో మంచి మ‌ట‌న్ కొన‌డం క‌చ్చితంగా అవ‌స‌రంగా మారింది. తాజా మటన్ వంటకాలకు మంచి రుచి ఇస్తుంది. మాంసం మెత్తగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా సురక్షితం. పాత మటన్ వల్ల దుర్వాసన, బ్యాక్టీరియా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మటన్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేయాలి.

26
తాజా మటన్ గుర్తించడానికి ముఖ్య లక్షణాలు

మటన్ తాజాదనాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.

రంగు – మంచి మటన్ ఎరుపు రంగులో ఉంటుంది. మసకగా కనిపిస్తే దూరంగా పెట్టాలి.

టెక్స్చర్ – మాంసం గట్టిగా ఉంటుంది. చేతికి అంటుకునేలా ఉండకూడదు.

ఫ్యాట్ – కొద్దిగా తెల్లని కొవ్వు మాంసంలో కనిపిస్తే అది మంచి లక్షణం. వంటలో రుచి పెరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే మటన్ నాణ్యమైనదని అర్థం.

36
వాసనతోనే మటన్ నాణ్యత తెలుసుకోవచ్చు

మటన్ వాసన చాలా ముఖ్యమైన సూచన. తాజా మటన్ కు సహజమైన వాసన ఉంటుంది. దుర్వాసన వస్తే అది పాత మటన్ కావచ్చు. ఆన్‌లైన్ డెలివరీ వచ్చిన తర్వాత ప్యాకెట్ తెరిచి వాసన పరీక్ష చేయాలి. వాసన బాగోలేకపోతే వంట చేయకపోవడం మంచిది. అదే విధంగా నేరుగా మార్కెట్‌లో కూడా వాస‌న చూసి కొనుగోలు చేయ‌డం మంచిది.

46
ఆన్‌లైన్‌లో మటన్ కొనేటప్పుడు ప్యాకేజింగ్ జాగ్రత్తలు

ఆన్‌లైన్ మాంసం కొనుగోలులో ప్యాకేజింగ్ కీలకం. గాలి చొరబడని ప్యాక్ ఉండాలి, చల్లగా లేదా ఫ్రోజన్ స్థితిలో డెలివరీ రావాలి. ప్యాకెట్ దెబ్బతినకుండా ఉండాలి. ప్యాకెట్ వేడిగా ఉంటే మటన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. నమ్మదగిన ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మాత్రమే ఆర్డర్ చేయాలి. నాణ్యమైన మటన్ కోసం సరైన విక్రేతను ఎంపిక చేయడం చాలా అవసరం. కస్టమర్ రివ్యూలు చదవాలి. డెలివరీ స్టోరేజ్ వివరాలు చెక్ చేయాలి.

56
మటన్ నిల్వ విధానం కూడా అంతే ముఖ్యం

మ‌ట‌న్‌ను ఇంటికి తీసుకొచ్చిన త‌ర్వాత దానిని స‌రైన విధానంలో నిల్వ చేయ‌డం కూడా ముఖ్య‌మే. ఒక‌వేళ ఉద‌యం తీసుకొచ్చి రాత్రి వంట చేసుకుంటాం అనుకుంటే వెంట‌నే వెంటనే ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో పెట్టాలి. గాలి చొర‌బ‌డ‌కుండా గట్టిగా కవర్ చేయాలి. ఇలా చేస్తే మటన్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవచ్చు.

66
మ‌ట‌న్‌లో ఏ పార్ట్ మంచిది.?

మ‌ట‌న్ నాణ్య‌త‌తో పాటు మ‌ట‌న్‌లో ఏ భాగాల‌ను సెల‌క్ట్ చేసుకోవాల‌నేది కూడా ముఖ్య‌మే. మంచి రుచి, పోష‌కాహారం కావాలంటే మేక ముందు కాళ్లు, మెడ, ఛాతీ, గొంతు, పక్కటెముకలు, కాలేయం వంటివి తీసుకోవాలి. మేక తొడ మాంసం మంచిది. ఇది మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories