
మేకలు, గొర్రెలను గుర్తించడంలో శరీర నిర్మాణం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కొమ్ములు:
మేకల్లో కొమ్ములు సాధారణంగా సన్నగా పైకి లేదా వెనక్కి వంగి ఉంటాయి. గొర్రెల కొమ్ములు మందంగా, చుట్టుకుని ఉండేలా కనిపిస్తాయి. కొన్ని గొర్రె జాతులకు కొమ్ములే ఉండవు.
తోక:
ఇక తోక విషయానికొస్తే మేకల తోక చిన్నగా ఉండి పైకి లేచినట్లు కనిపిస్తుంది. గొర్రెల తోక మాత్రం కిందికి వేలాడుతూ ఉంటుంది.
చర్మం, వెంట్రుకలు:
మేకలకు సాధారణంగా గట్టిగా ఉండే వెంట్రుకలు ఉంటాయి. కొన్ని జాతుల్లో క్యాష్మీర్, మొహైర్ వంటి ఫైబర్ కూడా లభిస్తుంది. గొర్రెలకు దట్టమైన ఉన్ని ఉంటుంది. ఈ ఉన్నే వాటి ప్రధాన ప్రత్యేకత.
ముఖ నిర్మాణం:
మేకల ముఖం సన్నగా, నిటారుగా ఉంటుంది. చాలా మేకలకు గడ్డం కూడా ఉంటుంది. గొర్రెల ముఖం కొంచెం వెడల్పుగా, గుండ్రంగా కనిపిస్తుంది.
మేకలు – బ్రౌజర్లు:
మేకలు చెట్ల ఆకులు, పొదలు, ఎత్తైన మొక్కలు తినడానికి ఇష్టపడతాయి. అవి వెనుక కాళ్లపై నిలబడి కూడా ఆకులు తింటాయి. కొత్త ప్రదేశాలు పరిశీలించడం వాటికి అలవాటు.
గొర్రెలు – గ్రేజర్లు:
గొర్రెలు ఎక్కువగా గడ్డి తింటాయి. నేలకు దగ్గరగా ఉన్న పచ్చికను మేసుకుంటూ గుంపులుగా తిరుగుతాయి.
సామాజిక స్వభావం:
గొర్రెలు గుంపులుగా ఉండటానికి ఇష్టపడతాయి. ఒకటి వెళ్తే మిగతావి వెంటనే అనుసరిస్తాయి. మేకలు మాత్రం కొంచెం స్వతంత్రంగా ఉంటాయి. అవి ఎక్కువ ఆసక్తిగా చుట్టూ పరిశీలిస్తుంటాయి.
తెలివితేటలు:
మేకలు సమస్యలను త్వరగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటాయి. కంచెలు దాటడం, కొత్త మార్గాలు కనుగొనడం వంటి విషయాల్లో అవి చురుకుగా ఉంటాయి.
గొర్రెల వల్ల ఉన్ని ఉత్పత్తి, మాంసం (మటన్), కొన్ని జాతుల నుంచి పాలు సేకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్ని పరిశ్రమలో గొర్రెలకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇక మేకల విషయానికొస్తే పాలు, మాంసం, క్యాష్మీర్, మొహైర్ వంటి ఫైబర్ వంటి ఉపయోగాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతులకు మేకల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారుతోంది.
కంచెలు బలంగా ఉండాలి:
మేకలు ఎక్కడం, దూకడం ఎక్కువ చేస్తాయి. అందుకే బలమైన కంచెలు అవసరం. గొర్రెలు ఎక్కువగా గుంపుగా తిరుగుతాయి కాబట్టి సాధారణ ఫెన్సింగ్ సరిపోతుంది.
ఆహారంలో తేడాలు:
మేకలకు కాపర్ ఎక్కువగా అవసరం అవుతుంది. కానీ అదే పదార్థం గొర్రెలకు ఎక్కువైతే హానికరం అవుతుంది. అందుకే రెండు జంతువులకు ఒకే మినరల్ మిశ్రమం ఇవ్వకూడదు.
ఆరోగ్య సమస్యలు:
రెండింటికీ పురుగుల సమస్యలు వస్తాయి. అయితే మేకలు, గొర్రెలకు చికిత్స విధానం కొంత భిన్నంగా ఉంటుంది. కాళ్ల సంరక్షణ కూడా వేర్వేరుగా చేయాలి.
చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే మేక మాంసం మంచి ఎంపికగా వైద్య నిపుణులు చెబుతున్నారు. మేక మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఐరన్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. మేక మాంసం గొర్రెతో పోల్చితే కాస్త సులభంగా జీర్ణమవుతుంది. హృదయ సంబంధిత సమస్యలు ఉన్న వారు, బరువు నియంత్రణలో ఉండాలనుకునేవారు మేక మాంసాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గొర్రె మాంసం ప్రత్యేకతలు
గొర్రె మాంసం రుచిగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. త్వరగా ఉడుకుతుంది కూడా. అయితే కొవ్వు శాతం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఆరోగ్య పరంగా మేక మాంసం మంచిది. అదే విధంగా రుచి పరంగా చూస్తే చాలామంది గొర్రె మాంసాన్ని ఇష్టపడుతారు. అందుకే వ్యక్తిగత ఆరోగ్యం, ఆహార అలవాట్లను బట్టి ఎంపిక చేసుకోవడం మంచిది.