Fruits and Vegetables Together: పండ్లు, కూరగాయలు ఒకేచోట నిల్వచేస్తే డేంజరంట.. ఎందుకో తెలుసా?

Published : Apr 18, 2025, 09:49 PM IST

Fruits and Vegetables: పండ్లు, కూరగాయలు వాటి తాజా దనాన్ని, పోషక విలువలను కాపాడుకోవడానికి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. అయితే, చాలా మంది వాటిని కలగలిపి ఒకేచోట నిల్వ చేస్తుంటారు. ఇలా చేస్తనే తప్పులో మీరు కాలేసినట్లే.. ఒకేచోట రెండింటిని కలిపి నిల్వ చేయడం వల్ల కొన్ని ఉత్పత్తులు త్వరగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా...  

PREV
15
Fruits and Vegetables Together: పండ్లు, కూరగాయలు ఒకేచోట నిల్వచేస్తే డేంజరంట.. ఎందుకో తెలుసా?
Vegetables

రెగ్యులర్‌గా మార్కెట్‌కు వెళ్తున్న క్రమంలో కూరగాయలు, ఫ్రూట్స్‌ కలిపి కొనుగోలు చేస్తుంటారు. ఇది అందరూ చేసేదే. ఈక్రమంలో కూరగాయలు, పండ్లను కలిపేస్తుంటాం. మరి కొందరు ఇంటికి తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో కలగలపి భద్రపరుస్తుంటాం. ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు. అసలు ఏ రెండు పండ్లు, కూరగాయలు కలపకూడదో? ఇప్పుడు చూద్దాం. 
 

25
Vegetables

ఎప్పుడూ కలిపి నిల్వ చేయకూడనవి.... 

1.బంగాళదుంప మరియు ఉల్లిపాయలు...
బంగాళాదుంపలు ఉల్లిపాయలను కలిపి నిల్వ చేయడం అందరూ చేసే సాధారణమైన తప్పు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే ఇథిలీన్ వాయువును వెలువడి.. బంగాళదుంపలు పాడయ్యేందుకు దోహదపడతాయంట. అంతేకాకుండా దుంపలు త్వరగా మొలకెత్తుతాయని, పాడైపోతాయని అంటున్నారు. ఇక బంగాళదుంపలు పాడైన తర్వాత వాటి నుంచి వచ్చే తేమ ఉల్లిపాయలు కుళ్ళిపోయేలా చేస్తుందట. అందుకే వేటికి అవే సెపరేట్‌గా గాలి వీచే ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలట. 

35
market Vegetables

2. టమోటాలు మరియు దోసకాయలు
టమోటాలు మరియు దోసకాయలను కలిపి నిల్వ చేయకూడదట. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్‌లో ఈ రెండింటినీ ఒకచోట ఉంచకూడదట. టమోటాలు ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. దీని వల్ల దోసకాయలు పండిపోవడం, స్పీడ్గా కుల్లిపోవడానికి కారణం అవుతాయి. అందువల్ల దోసకాయలు టమాటాలు దూరంగా ఉంచాలని అంటున్నారు. 

45
Vegetables

3. ద్రాక్ష మరియు ఆకుకూరలు
ద్రాక్ష ఇథిలీన్ వాయువును విడుదల చేస్తుందని అంటున్నారు.. ఇది పాలకూర, ఇతర ఆకుకూరలను చాలా త్వరగా వాడిపోవడానికి కారణమవుతాయంట. మీ ఇంట్లోని ఆకుకూరలను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి, ద్రాక్ష, ఆకు కూరలను వేర్వేరుగా భద్రపరుచుకోవాలంట. 

 

55
Vegetables

4. క్యాలీ ఫవర్‌ మరియు టమోటాలు
టమాటాల నుంచి ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది. క్యాలీఫ్లవర్‌తోపాటు టమోటాలను నిల్వ చేస్తే క్యాలీ ఫ్లవర్‌ త్వరగా పసుపు రంగులోకి మారుతుంది. టమోటాలు వాయువును విడుదల చేయడం వల్ల క్యాలీఫ్లవర్‌ రంగు మారడంతోపాటు పోషక విలువలను కోల్పోతుందట వీటిని వేర్వేరుగా పెట్టుకుంటే మంచిదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే.... తీసుకునే ఆహారం బాగుండాలి. ఆహార భద్రత గురించి తెలుసుకున్నారు.. కదా జాగ్రత్తగా ఉండండి మరి. 

Read more Photos on
click me!