Water Melon: డ‌యాబెటిస్ ఉన్న వారు పుచ్చ‌కాయ తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Published : Apr 24, 2025, 05:33 PM IST

వేసవి కాలం వచ్చిందంటే మనం గుర్తుచేసుకునే మొదటి పండు పుచ్చకాయే. రోడ్డుపై ఎక్క‌డ చూసినా పుచ్చ‌కాయ ద‌ర్శ‌న‌మిస్తాయి. రుచికి తియ్య‌గా ఉండ‌డంతో పాటు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది. అయితే పుచ్చ‌కాయ విష‌యంలో మ‌న‌లో కొంత మందికి అనుమానాలు ఉంటాయి. అందులో ఒక అనుమానం గురించి, అందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Water Melon: డ‌యాబెటిస్ ఉన్న వారు పుచ్చ‌కాయ తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే

పుచ్చ‌కాయ తియ్య‌గా ఉండ‌డం వ‌ల్ల మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు ఈ పండును తినాలా వద్దా అనే సందేహంలో ఉంటారు. తియ్యంగా ఉండ‌డంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డానికి దారి తీస్తాయ‌ని న‌మ్ముతుంటారు.  తీసుకునే ఆహారం ఎంచుకునేటప్పుడు అత్యంత కీలకంగా పరిగణించేది గ్లైసెమిక్ ఇండెక్స్ (GI). ఇది ఒక ఆహార పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతుందో తెలియజేస్తుంది.
 

25
water melon

పుచ్చకాయ GI: సుమారు 72 — ఇది పెరిగిన GI వర్గానికి చెందుతుంది. గ్లైసెమిక్ లోడ్ (GL): 100 గ్రాములకు దాదాపు 5 మాత్రమే, అంటే తక్కువ GL వర్గంలోకి వస్తుంది.  పుచ్చకాయ తిన్న తర్వాత రక్త చక్కెర స్థాయి వేగంగా పెరిగే అవకాశం ఉన్నా, ఒకేసారి తినే పరిమాణం తక్కువగా ఉంటే దాని ప్రభావం పెద్దగా ఉండదు. 

35
water melon

డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా?

అవును, పుచ్చకాయను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి.  రోజుకు సుమారు 100-150 గ్రాముల (సుమారు 1 కప్పు) తరిగిన పుచ్చకాయ ముక్కలు తినొచ్చు. రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.

45

జ్యూస్ కంటే ముక్కలు తీసుకోవ‌డం మంచిది. దీనికి కార‌ణం జ్యూస్‌లో ఫైబ‌ర్ ఉండ‌దు అలాగే చ‌క్కెర వేసుకుంటాం. ఇది జీఐ మ‌రింత పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతుంది. మీ డైలీ కార్బోహైడ్రేట్ లిమిట్‌ను దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయను ప్లాన్ చేసుకోవాలి. 
 

55
प्रतिकात्मक फोटो

ఇలాంటి వాళ్లు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌గా ఉండాలి: 

* మీ రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే.

* HbA1c స్థాయి 7.5% పైగా ఉంటే.

* మీరు ఇన్సులిన్ ఆధారిత చికిత్సలో ఉంటే.

* ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినే అలవాటు ఉంటే.

పైన తెలిపిన స‌మ‌స్య‌లున్న వారు పుచ్చ‌కాయ తినాల‌నుకుంటే వైద్యుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. 

గ‌మ‌నిక‌: ఈ వివ‌రాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం. 

Read more Photos on
click me!

Recommended Stories