Food: నూనె ఎక్కువగా వాడితే డిప్రెషన్, ఆందోళన పెరుగుతుందని తెలుసా.?

Published : May 15, 2026, 08:40 AM IST

Food: చాలా మంది వేయించిన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పకోడీలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫాస్ట్ ఫుడ్ వంటి పదార్థాలు రుచిగా అనిపించినా.. అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
15
భారత్‌లో చాలా మంది ఆయిలీ ఫుడ్‌కే అలవాటు

ఆరోగ్య సమాచారం అందించే రెడ్‌క్లిఫ్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో దాదాపు 38 శాతం మంది తరచుగా వేయించిన స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. అయితే కేవలం 28 శాతం మంది మాత్రమే పండ్లు, కూరగాయలు, పోషకాహారం ఉన్న సమతుల్య ఆహారం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో హై క్యాలరీ, ఆయిలీ ఫుడ్ వినియోగం మరింత పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

25
వేయించిన ఆహారం ఎందుకు ఎక్కువగా తింటున్నారు?

నిపుణుల ప్రకారం.. వేయించిన ఆహారం రుచిగా ఉండటం వల్ల చాలా మంది వాటిని ఇష్టపడుతున్నారు. అలాగే ఆకలి, క్రేవింగ్స్‌ను వెంటనే తగ్గిస్తుందని భావిస్తారు. కానీ ఇదే అలవాటు క్రమంగా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

35
జీర్ణ సమస్యలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ఎక్కువ నూనెతో చేసిన ఆహారం మొదటగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత చాలామందికి కడుపు బరువుగా అనిపించడం, అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ వంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతాయి. ఇది మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు. కొన్ని అధ్యయనాల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ తినేవారిలో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు వెల్లడైంది.

45
గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ప్రమాదం

ఎక్కువ నూనెతో చేసిన ఆహారం తరచుగా తింటే బరువు వేగంగా పెరుగుతుంది. ఫ్రైడ్ ఫుడ్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రం తక్కువగా ఉంటాయి. దీంతో ఊబకాయం, మధుమేహం, బీపీ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఆయిలీ ఫుడ్ వల్ల శరీరంలో ఎల్‌డీఎల్ (చెడుకొలెస్ట్రాల్) పెరిగి, హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) తగ్గుతుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్, హైబీపీ ప్రమాదం పెరుగుతుంది.

55
ఫ్యాటీ లివర్, డయాబెటిస్ ప్రమాదం.. ఎలా తగ్గించాలి?

నిపుణుల ప్రకారం.. అధికంగా వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రైడ్ ఫుడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యలకు కూడా ఆయిలీ డైట్ ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. అయితే చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. డీప్ ఫ్రై చేసిన పదార్థాల బదులు బేక్ చేసిన లేదా గ్రిల్ చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories