Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?

Published : May 14, 2026, 10:00 AM IST

 Ripen Raw Mangoes: ఇంట్లోనే మామిడి పండ్లు మగ్గపెట్టాలని అనుకుంటున్నారా? సరైన పద్దతిలో మగ్గపెట్టకపోతే అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మరి, కాయ పాడవ్వకుండా పండ్లు ఎలా మగ్గపెట్టాలో తెలుసా? 

PREV
13
Raw Mango

ఎండాకాలం వచ్చింది అంటే మామిడి పండ్ల సీజన్ వచ్చేసినట్లే. అందరూ సమ్మర్ లో ఈ పండ్లు తిని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ, మార్కెట్లో దొరికే అన్ని పండ్లను నమ్మలేం. ముఖ్యంగా, కెమికల్స్ తో పండించిన ఆ పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలా అని, పచ్చి కాయలు కొనుక్కొని ఇంట్లోనే కెమికల్స్ లేకుండా మగ్గపెడదాం అని చాలా మంది అనుకుంటారు. కానీ, సరైన విధానంలో మగ్గపెట్టకపోతే.. అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది.అలా కాకుండా.. ఇంట్లో మంచిగా పండాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం...

23
మామిడి పండ్లను ఈజీగా పండించే పద్ధతులు...

1.గడ్డిలో లేదా బియ్యంలో నిల్వ చేయవచ్చు...

రసాయనాలు లేకుండా మామిడి పండ్లను పండించొచ్చు. దీని కోసం మీ ఇంట్లో బియ్యం లేదా గడ్డి ఉంటే చాలు. ముందుగా ఒక పాత్రను తీసుకొని దానిని పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత పచ్చి మామిడి పండ్లను అందులో ఉంచాలి. ఆ తర్వాత దానిని వరి గడ్డి లేదా బియ్యంతో నింపాలి. ఇలా చేయడం వల్ల రెండు రోజుల్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా మామిడి పండ్లు సహజంగా పండుతాయి. రుచి కూడా ఏమీ మారదు. తియ్యగా ఉంటాయి.

2.అరటి పండ్లతో నిల్వ చేస్తే...

మామిడి పండ్లు ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా ఇంట్లోనే పండాలి అంటే అరటి పండ్లతో కలిపి నిల్వ చేస్తే సరిపోతుంది. అరటి పండ్లు ఇథిలీన్ వాయివును విడుదల చేస్తాయి. ఇవి సహజంగా మామిడి పండ్లను పండిస్తాయి. ఒక పచ్చి మామిడికాయను, రెండు లేదా మూడు పండిన అరటి పండ్లను ఒక కాగితపు సంచిలో లేదా బుట్టలో కలిపి ఉంచాలి. ఆ తర్వాత దానిని పూర్తిగా మూసివేయాలి. ఇలా చేయడం వల్ల రెండు రోజుల్లో మామిడి పండ్లు మంచిగా పండుతాయి.

33
3.న్యూస్ పేపర్ లో చుట్టండి..

మామిడి పండ్లను న్యూస్ పేపర్ లో చుట్టినా కూడా తొందరగా పండుతాయి. పచ్చి కాయలను న్యూస్ పేపర్ లో చుట్టి.. వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. దీని వల్ల పండ్లు సమానంగా పండుతాయి.

4.బియ్యం డబ్బాలో...

మామిడి పండ్లను బియ్యం డబ్బాలో పెట్టినా కూడా చాలా తొందరగా పండుతాయి. బియ్యం డబ్బాలో వేడి కారణంగా తొందరగా కాయలు పండుతాయి. రుచిగా కూడా ఉంటాయి.

5. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి.

మామిడి పండ్లు త్వరగా పండాలంటే, వాటిని ఒక బుట్టలో పెట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి. గది ఉష్ణోగ్రత వల్ల మామిడి పండ్లు నెమ్మదిగా పండుతాయి. అవి చెట్టు మీద పండిన మామిడి పండ్లలా రుచిగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories