Food: చికెన్ లివ‌ర్ వ‌ర్సెస్ మ‌ట‌న్ లివ‌ర్‌.. రెండింటీ మ‌ధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది.?

Published : Dec 19, 2025, 01:42 PM IST

Food: ఆదివారం వ‌చ్చిందంటే చాలు నాన్ వెజ్ ల‌వ‌ర్స్ నోరూర‌డం ఖాయం. క‌చ్చితంగా చికెన్ లేదా మ‌ట‌న్ లాగించాల్సిందే. మాంసంతో స‌మానంగా లివ‌ర్‌ను ఇష్ట‌ప‌డే వారు కూడా ఉంటారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ లివ‌ర్స్‌లో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
లివ‌ర్ కూడా ఇష్ట‌ప‌డుతుంటారు.

చికెన్, మటన్ వంటకాలు చాలామందికి ప్రత్యేక ఇష్టం. వారంలో ఒక్క‌రోజైనా నాన్ వెజ్ తినాల్సిందే. ఇక కొంద‌రు ప్ర‌త్యేకంగా లివ‌ర్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. లివర్ ఫ్రై, కర్రీ రూపంలో తరచూ తింటున్నారు. అయితే లివర్ నిజంగా ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తుంది అన్న సందేహం చాలామందిలో ఉంటుంది.

25
మటన్ లివర్‌లో పోష‌కాలు

మటన్ లివర్ పోషకాల పరంగా చాలా బలమైన ఆహారం. ఇందులో ఐరన్, జింక్, రాగి, పొటాషియం మంచి మోతాదులో ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. విటమిన్ A, B గ్రూప్ విటమిన్లు అధికంగా ఉండటంతో కంటి ఆరోగ్యం, చర్మ బలం మెరుగవుతాయి. విటమిన్ B12 శరీర రోగనిరోధక శక్తిని పెంచే పాత్ర పోషిస్తుంది.

35
వీరు మ‌ట‌న్ లివ‌ర్‌కు దూరంగా ఉంటే మంచిది

మటన్ లివర్ లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీన్ని తరచూ తినడం మంచిది కాదు. గర్భిణీలు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారిలో ఇది సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్ ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

45
చికెన్ లివర్ ప్రయోజనాలు ఏంటి?

చికెన్ లివర్‌లో ప్రోటీన్లు, ఐరన్, ఫోలేట్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. సెలీనియం ఉండటం వల్ల శరీరంలో వాపు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కంటి ఆరోగ్యం, చర్మ సంరక్షణకు ఇది సహకరిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడేందుకు విటమిన్ B12 ఉపయోగపడుతుంది.

55
చికెన్ లివర్ ఎవరు తినకూడదు?

చికెన్ లివర్ లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు చికెన్ లివర్ తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారైనా వారానికి ఒకసారి పరిమిత మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories