Dosa Mix: ఇదొక్క పొడి రెడీ చేసుకుంటే.. పప్పు రుబ్బేపని లేకుండా క్రిస్పీ , టేస్టీ దోశలు రెడీ

Published : Apr 20, 2026, 04:45 PM IST

 Dosa Mix:దోశ పిండి తయారు చేయడం పెద్ద పని. పప్పు, బియ్యం నానపెట్టాలి.. తర్వాత మళ్లీ రుబ్బుకోవాలి.. ఆ తర్వాత దానిని పులియబెట్టాలి.  ఎప్పుడు దోశ కావాలన్నా ఈ పద్దతి ఫాలో అవ్వాల్సిందే. కానీ..ఇవేమీ లేకుండా నిమిషాల్లో దోశ రెడీ చేసుకునే టెక్నిక్ ఒకటి ఉంది. 

PREV
13
ఇన్ స్టాంట్ దోశ...

సౌత్ ఇండియన్స్ కి బ్రేక్ ఫాస్ట్ అంటే రోజూ  ఇడ్లీ, దోశ ఉండాల్సిందే. ఇవి తినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ,  ఈ దోశ, ఇడ్లీ పిండి తయారు చేయడమే చాలా పెద్ద పని. అంతేకాదు… ఈ రోజు ఉదయం దోశ తినాలంటే.. ముందు రోజే పిండి తయారు చేసుకోని పెట్టుకోవాలి.

కానీ, ఇంత శ్రమ లేకుండా.. ఒక్కసారి ఈ దోశ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఈ దోశ మిక్స్ చేసుకుంటే.. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు.  రుచిగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

23
హోటల్ నిర్వాహకులు చెప్పిన సీక్రెట్..

స్టార్ హోటల్స్ లో పని చేసే చెఫ్ లు చెప్పిన సీక్రెట్ ఇది. పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేకుండా.. దోశ మిక్స్ పౌడర్ తయారు చేసుకుంటే.. నచ్చినప్పుడు దోశలు వేసుకోవచ్చు. మనం నార్మల్ గా వేసుకునే దోశల కంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే.. ఈ పొడి ఎలా తయారు చేయాలి అనే విషయం మాత్రం తెలుసుకోవాలి. 

33
ఫ్రిజ్ కూడా అవసరం లేదు..

ఈ పొడిని వేరే దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టకుండానే ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.

ఈ పొడి తయారీకి ఒక కేజీ బియ్యం, 250 గ్రాముల మినపప్పు, 100 గ్రాముల అటుకులు మాత్రమే కావాలి. అన్నింటినీ కడిగి నీడలో ఆరబెట్టాలి. అవి బాగా ఆరిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. మీకు దోశ, ఇడ్లీ తినాలనిపించినప్పుడు, ఈ పొడిని నీళ్లలో కలిపి రాత్రి నానబెడితే, ఉదయానికి పిండి పులిసి సిద్ధంగా ఉంటుంది. ఈ పిండితో చేసిన దోశ-ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories