Egg Ponganalu: ఇడ్లీ, దోశె బోర్ కొట్టిందా?..ఈ రెసిపీ ట్రై చేయండి..పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు

Published : Nov 10, 2026, 11:31 AM IST

Egg Ponganalu: రోజూ ఇడ్లీ, దోశె, చపాతీలు తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు కూడా మొహమాటం లేకుండా ఇష్టంగా లాగించేస్తారు. లంచ్ బాక్స్ లో ఖాళీ చేసేస్తారు. స్నాక్స్ లాగా తినొచ్చు. ఎలా చేయాలో చూసేయండి.

PREV
15
వెరైటీగా గుడ్డు పొంగనాలు ట్రై చేయండి

పిల్లలకు రోజూ లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి అని ఆలోచించే తల్లిదండ్రులకు, రుచిగా, ఆరోగ్యంగా ఉండే ఫుడ్ సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమే. ముఖ్యంగా కూరగాయలు తినని పిల్లలకు వారు ఇష్టపడేలా చేసి పెట్టడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉండే దోశ పిండి, గుడ్డుతో ఈజీగా చేసుకోగలిగే టేస్టీ ఐటమ్ ఈ గుడ్డు పొంగనాలు.

ఇందులో గుడ్డుతో పాటు క్యారెట్, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల పిల్లలకు టేస్టీగా ఉండటమే కాకుండా చాలా పోషకాలు అందుతాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, సాయంత్రం స్నాక్స్‌గా, పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా ఈ గుడ్డు పొంగనాలు ఇవ్వొచ్చు. పెద్దవాళ్లు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే వస్తువులతో తక్కువ టైమ్‌లో ఈ గుడ్డు పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం.

25
గుడ్డు పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు

తయారీ సమయం: సుమారు 10–15 నిమిషాలు

- దోశ పిండి – 1 కప్పు

- గుడ్డు – 1 లేదా 2

- ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

- పచ్చిమిర్చి – 1 లేదా 2 (సన్నగా తరిగినవి)

- క్యారెట్ – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు (తురిమినది)

- కరివేపాకు – తగినంత

- కొత్తిమీర – తగినంత

- జీలకర్ర – చిటికెడు

- ఇంగువ – చిటికెడు

- కారం – తగినంత

- ఉప్పు – తగినంత

- కొబ్బరి నూనె – పొంగనాల పెనంలో వేయడానికి

35
పిల్లల కోసం టేస్టీ గుడ్డు పొంగనాలు ఎలా చేయాలి?

ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు దోశ పిండి వేసి, గుడ్డు పగలగొట్టి వేయండి. రెండూ ఉండలు లేకుండా బాగా కలపాలి. గుడ్డు, దోశ పిండి కలిసి సాఫ్ట్‌గా అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్ వేసుకోండి.

అందులోనే కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇంగువ, తగినంత ఉప్పు వేయాలి. పిల్లలు ఎక్కువ కారం తినకపోతే పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు. ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అన్ని పదార్థాలను పిండితో బాగా కలుపుకోవాలి.

45
గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఉడికించాలి

స్టౌ మీద పొంగనాల పెనం పెట్టి మీడియం మంట మీద వేడి చేయండి. ఒక్కో గుంటలో కొంచెం కొబ్బరి నూనె వేయండి. నూనె వేడయ్యాక, రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక్కో గుంటలో తగినంత వేయాలి. గుంట నిండా పిండి వేయకుండా, కొంచెం గ్యాప్ వదిలి వేయడం మంచిది. అప్పుడే పొంగనాలు బాగా ఉడుకుతాయి.

పిండి వేసిన తర్వాత మీడియం మంట మీద ఉడికించాలి. ఒకవైపు బాగా ఉడికి, అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారాక గరిటెతో నెమ్మదిగా తిరగేయండి. రెండో వైపు కూడా బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. గుడ్డు పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పొంగనాలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి, లోపల సాఫ్ట్‌గా ఉడికాక స్టౌ మీద నుంచి దించుకోవచ్చు. అంతే! టేస్టీ, హెల్దీ గుడ్డు పొంగనాలు రెడీ. ఈ పొంగనాలను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా పిల్లలకు ఇష్టమైన చట్నీతో వడ్డించొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి, సాయంత్రం స్నాక్స్‌గా ఇవ్వడానికి ఇది పర్ఫెక్ట్.

55
ఇంకా హెల్దీగా చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్!

క్యారెట్‌తో పాటు బీన్స్, క్యాప్సికమ్ లేదా సన్నగా తరిగిన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కారం తగ్గించి, వారికి ఇష్టమైన కూరగాయలు ఎక్కువగా వేయొచ్చు. కొంచెం మిరియాల పొడి లేదా జీలకర్ర వేస్తే పొంగనాలకు మంచి వాసన, రుచి వస్తుంది. పొంగనాలను పూర్తిగా ఉడికించి, కొంచెం చల్లారాక లంచ్ బాక్స్‌లో పెట్టండి. చట్నీని విడిగా పంపడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories