Crispy Poori: ఇంట్లో పూరీలు చేసినప్పుడు కొన్నిసార్లు అవి పొంగకుండా గట్టిగా వస్తుంటాయి. దీనికి పిండి కలపడంలోనే కాదు.. వేయించడానికి ఉపయోగించే నూనె కూడా కారణమై ఉండొచ్చు. మరి పూరీలు బాగా పొంగి, రుచిగా, క్రిస్పీగా రావాలంటే ఏ నూనె వాడాలి?
పండుగలు వస్తే చాలు ఇంట్లో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అందులోనూ వేడి వేడిగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండే పూరీలకు ఉండే క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ పూరీలు చేసేటప్పుడు పిండి కలపడం నుంచి వేయించే వరకు మేకింగ్ ప్రాసెస్ చాలా ముఖ్యం. పూరీలు వేయించే నూనె ముఖ్యం. నూనెలో వేయించినవి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ, పండుగలు స్పెషల్ రోజుల్లో పూరీలు తినడం తప్పు కాదు. ఇలాంటప్పుడు ఎక్కువ వేడిని తట్టుకుని, స్టేబుల్ గా ఉండే నూనెను వాడాలి. పూరీలు వేయించడానికి వాడే 5 రకాల నూనెల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
రైస్ బ్రాన్ ఆయిల్
పూరీలు వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్ చాలా మంచి ఆప్షన్. ఇది ఎక్కువ టెంపరేచర్ లో కూడా స్టేబుల్ గా ఉంటుంది. త్వరగా పాడవదు. ఇందులో మోనో అన్ శ్యాచురేటెడ్, పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీనికి స్పెషల్ స్మెల్ ఏమీ ఉండదు. కాబట్టి, పూరీ రుచిలో ఎలాంటి మార్పు రాదు.
నెయ్యి
నెయ్యితో చేసిన పూరీలకు మంచి స్మెల్, రుచి వస్తుంది. పండుగలు, స్పెషల్ రోజుల్లో నెయ్యితో చేసిన పూరీలను చాలామంది ఇష్టపడతారు. నెయ్యి స్మోక్ పాయింట్ ఎక్కువ. కాబట్టి దీన్ని వేయించడానికి వాడొచ్చు. కానీ ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లిమిట్ లో వాడటం మంచిది.
35
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ కేవలం సలాడ్స్ కే వాడతారని చాలామంది అనుకుంటారు. కానీ, రిఫైండ్ ఆలివ్ ఆయిల్ ను ఎక్కువ వేడిలో వేయించడానికి వాడొచ్చు. ఇందులో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. దీని స్మోక్ పాయింట్ 465°F వరకు ఉంటుంది. అయితే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, రిఫైండ్ ఆలివ్ ఆయిల్ ఒకటే కాదు. ఎక్కువ డీప్ ఫ్రై చేయడానికి రిఫైండ్ ఆయిల్ వాడటం మంచిది.
సాఫ్ ఫ్లవర్ ఆయిల్ (కుసుమ నూనె)
కుసుమ గింజలతో చేసే నూనె కూడా పూరీలు వేయించడానికి మంచిదే. ఎక్కువ వేడిని తట్టుకునే ఈ నూనెకు ఘాటైన వాసన, స్పెషల్ టేస్ట్ ఉండదు. దీనివల్ల పూరీ ఒరిజినల్ టేస్ట్ మారదు. క్రిస్పీ పూరీలు కావాలనుకునేవారు ఈ నూనె వాడొచ్చు.
రిఫైండ్ కోకోనట్ ఆయిల్ తో కూడా పూరీలు వేయించొచ్చు. దీని స్మోక్ పాయింట్ ఎక్కువ. కాబట్టి ఎక్కువ వేడిలో వేయించడానికి బాగుంటుంది. కానీ, కొబ్బరి నూనెకు స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఇష్టపడని వారికి ఇది నచ్చకపోవచ్చు. ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. కాబట్టి లిమిట్ లో వాడాలి.
55
పూరీలు వేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు!
మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ వాడొద్దు. ఒకసారి పూరీలు వేయించిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం మంచిది కాదు. పదే పదే వేడి చేయడం వల్ల నూనెలో చెడు మార్పులు జరుగుతాయి. పూరీలో ఎక్స్ట్రా నూనె తీసేయండి. పూరీలు వేయించిన తర్వాత టిష్యూ పేపర్ లేదా ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్ మీద పెట్టండి. దీనివల్ల పూరీ మీద ఉండే ఎక్స్ట్రా నూనె పోతుంది. నూనె పొగ వచ్చేలా వేడి చేయొద్దు. నూనెను మరీ ఎక్కువ వేడి చేస్తే దాని క్వాలిటీ పాడవుతుంది. కాబట్టి, వేయించడానికి సరిపడా టెంపరేచర్ ఉండేలా చూసుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు జాగ్రత్త. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు నూనెలో వేయించిన ఫుడ్స్ ఎక్కువ తినొద్దు. డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే తినాలి.