Constipation: చలికాలంలో మలబద్దకమా? ఇవి ఫాలో అయితే చాలు

Published : Nov 27, 2025, 04:44 PM IST

Constipation:  చలికాలంలో  వాతావరణం చల్లగా ఉంటుంది. తక్కువ నీరు తాగుతూ ఉంటాం.  దీని వల్ల కడుపు శుభ్రం కాదు. దీని వల్ల మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.

PREV
15
మలబద్దకం...

చలికాలంలో  చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్య ఏదైనా ఉంది అంటే అది మలబద్దకం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనం సరైన ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య ఏర్పడవచ్చు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…  

25
చలికాలంలో మలబద్ధకం ఎందుకు వస్తుంది?

చలికాలంలో దాహం వేయదు. దీంతో మనం నీరు ఎక్కువగా తీసుకోం. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, ప్రేగులు పొడిగా మారి మలవిసర్జన కష్టమవుతుంది. శారీరక శ్రమ తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు.

35
మలబద్దానికి చెక్ పెట్టే చిట్కాలు...

పరగడుపున గోరు వెచ్చని నీరు…

ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగాలి. ఇది ప్రేగులను త్వరగా శుభ్రపరుస్తుంది.

45
త్రిఫల లేదా ఎండుద్రాక్ష

దీర్ఘకాలిక మలబద్ధకం ఉంటే, రాత్రిపూట గోరువెచ్చని నీటితో ఒక చెంచా త్రిఫల చూర్ణం తీసుకోండి. లేదా 5-6 ఎండుద్రాక్షలను పాలలో మరిగించి,  ఆ పాలు తాగినా ఉదయానికి కడుపు శుభ్రపడుతుంది.

55
ఈ విషయాలను కూడా గమనించండి

*దాహం వేయకున్నా రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగండి.
*ఆహారంలో ఫైబర్, సలాడ్లు చేర్చండి.
*తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. లేదా ఆహారం తిన్న వెంటనే కాసేపు నడవాలి. 

ఈ చిట్కాలు ప్రయత్నిస్తే… తేాడా మీకే కనిపిస్తుంది..

Read more Photos on
click me!

Recommended Stories