రోజూ ఒక స్పూన్ మునగపొడిని నీళ్లలో వేసుకుని తాగితే ఏమౌతుందో తెలుసా?

Published : Aug 12, 2025, 01:01 PM IST

మునగాకు మంచి హెల్తీ ఫుడ్. దీనివల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. దీని పొడిని గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే మీరు ఎన్నో బెనిఫిట్స్ ను పొందుతారు. అవేంటంటే? 

PREV
14

మునగాకు తెలియని వారుండరు. ఇది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు.. పోషకాల గని అనే చెప్పాలి. ఎందుకంటే దీనిని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగానూ ఉంటా. అందంగా కూడా కనిపిస్తాం. మీరు గనుక ఈ మునగపొడిని రోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. కొన్ని సమస్యలను తగ్గించుకోగలుగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24

మునగపొడి వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గుతారు

మీరు కూడా ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నట్టైతే మీకు ఈ మునగపొడి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మునగపొడిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీకు తొందరగా ఆకలి కాదు. అలాగే పదేపదే తినకుండా ఉంటారు. ఈ మునగపొడి మీ జీర్ణక్రియను కూడా పెంచుతుంది. దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా మీరు మునగపొడితో బరువు తగ్గుతారు.

34

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం

మునగపొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మీ జుట్టుకు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. మీ జుట్టు రాలిపోతున్నా, మీ చర్మం డ్రై గా ఉన్నా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అవును మునుగపొడిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మీ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. అలాగే మీ జుట్టు మందంగా అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ పొడిని రోజూ తీసుకుంటే లోపలి నుంచి మీ అందం పెరుగుతుంది.

44

ఎముకలు బలంగా ఉంటాయి

వయసు పెరిగేకొద్దీ ఎముకల బలం తగ్గిపోవడం చాలా కామన్. అయితే మునగాకు ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. మునగపొడిలో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియం, ఫాస్ఫరస్ లు మెండుగా ఉంటాయి. ఈ పొడిని తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి మీరు తప్పించుకుంటారు. ఈ పొడిని రోజూ తీసుకుంటే కీళ్ల వాపు, నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories